అక్కడ బాహుబలి మూవీ రికార్డును బ్రేక్ చేసిన మహారాజ మూవీ.. ఏం జరిగిందంటే?

విజయ్ సేతుపతి ( Vijay Sethupathi )నటించిన మహారాజ సినిమా( Maharaja movie ) గత ఏడాది విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

అయితే ఈ సినిమా చైనాలో( China ) సైతం విడుదలైన విషయం తెలిసిందే.చైనాలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం మామూలు విషయం కాదని చెప్పాలి.

భాష కాని భాషలో విడుదల విజయాన్ని సాధించడం అన్నది నిజంగా చాలా గొప్ప విశేషం.చైనా దేశంలో ఇప్పటివరకు టాప్ గ్రాసర్స్ గా ఉన్న సినిమాలన్నీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలే అన్న విషయం తెలిసిందే.

అమీర్ ఖాన్ దంగల్ మూవీ 1480 కోట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో అమీర్ ఖాన్ నటించిన మరో సినిమా 840 కోట్లతో రెండవ స్థానంలో ఉంది.ఇక మూడో స్థానంలో 368 కోట్లతో అందాదున్ సినిమా ఉంది.

Advertisement

ఆ దేశంలో ఇప్పటిదాకా టాప్ గ్రాసర్స్ గా ఉన్న సినిమాలన్నీ బాలీవుడ్ నుంచి వచ్చినవే.అమీర్ ఖాన్ దంగల్ 1480 కోట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా అదే హీరో సీక్రెట్ సూపర్ స్టార్ 840 కోట్లతో రెండో ప్లేస్ లో ఉంది.మూడో స్థానం అందాదున్ తీసుకుంది.

దాని లెక్క 368 కోట్లు.ఆ తర్వాత స్థానాలలో వరసగా భజరంగి భాయ్ జాన్ 323 కోట్లు, హిందీ మీడియం 238 కోట్లు,హిచ్కీ 170 కోట్లు, పీకే 134 కోట్లు, మామ్ 130 కోట్లు, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ 108 కోట్లతో ఉన్నాయి.

ఇప్పుడు మహారాజా 92 కోట్లతో పదో ర్యాంక్ లో నిలిచింది.చైనాలో టాప్ 10 ఇండియన్ సినిమాల్లో దక్షణాది మహారాజ ఒక్కటే.

అయితే ఇంకా ఈ సినిమా చైనా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధిస్తూనే ఉంది.ఫైనల్ రన్ పూర్తవ్వలేదు.

శోభితతో వైవాహిక జీవితం పై చైతన్య షాకింగ్ కామెంట్స్... తన సలహా తప్పనిసరి అంటూ?
కండోమ్ యాడ్ కు ఆ హీరోయిన్ పర్ఫెక్ట్ ఛాయిస్.. బిజినెస్ మేన్ కామెంట్లపై విమర్శలు!

ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే ఈజీగా 100 కోట్ల రికార్డును బ్రేక్ చేయడం ఖాయం అనిపిస్తోంది.కాగా చైనాలో రాజమౌళి బాహుబలి 2 కేవలం 80 కోట్లతో ఉండగా బాహుబలి 50 కోట్లతో సరిపెట్టుకుంది.ఆర్ఆర్ఆర్ 40 కోట్ల దగ్గర రాజీ పడింది.

Advertisement

ఈ లెక్కన మహారాజ ప్రభావం ఏ స్థాయిలో చైనా ప్రేక్షకుల మీద ఉందో అర్థం చేసుకోవచ్చు.స్వంత కూతురు కాకపోయినా ఒక అమ్మాయి అఘాయిత్యానికి బలైతే పెంచుకున్న తండ్రి తీర్చుకునే ప్రతీకారం చైనా జనాలకు ఒక రేంజ్ లో కనెక్ట్ అయిపోయింది.

సీరియస్ టోన్ లో సాగుతూ ఎక్కడా కమర్షియల్ అంశాలకు చోటు లేకుండా తీసిన విధానం విమర్శకులను సైతం మెప్పించింది.

తాజా వార్తలు