ముఖంపై ఎలాంటి మ‌చ్చ‌లున్నా మాయం చేసే మ్యాజిక‌ల్‌ రెమెడీ మీకోసం!

మొటిమ‌లు, వ‌య‌సు పై బ‌డ‌టం, హార్మోన్ ఛేంజ‌స్‌, కెమిక‌ల్స్‌తో నిండి ఉండే ఉత్పత్త‌ల‌ను చ‌ర్మానికి వాడ‌టం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం, ఒత్తిడి వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ముఖంపై న‌లుపు, గోధుమ రంగుల్లో మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి.

ముఖ చ‌ర్మం ఎంత తెల్ల‌గా, మృదువుగా ఉన్నా ఆయా మ‌చ్చ‌లు ఉంటే కాంతిహీనంగా క‌నిపిస్తారు.

అందుకే చ‌ర్మంపై ఏర్ప‌డ్డ మ‌చ్చ‌ల‌ను నివారించుకోవ‌డం కోసం తోచిన చిట్కాల‌న్నీ ప్ర‌య‌త్నిస్తుంటారు.ఖ‌రీదైన క్రీమ్స్, సీర‌మ్స్‌, జెల్స్ ఉప‌యోగిస్తుంటారు.

అయినా ఫ‌లితం లేకుంటే ట్రీట్‌మెంట్స్ వ‌ర‌కు వెళ్తుంటారు.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే మ్యాజిక‌ల్ రెమెడీని ట్రై చేస్తే ముఖంపై ఎలాంటి మ‌చ్చ‌లు ఉన్నా క్ర‌మంగా మాయం అవుతాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో, ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ములేటి పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ శెన‌గ‌పిండి, చిటికెడు ప‌సుపు వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఆ త‌ర్వాత అందులో వ‌న్ టేబుల్ స్పూన్‌ ప్రెష్ పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ స్వ‌చ్ఛ‌మైన తేనె, నాలుగైదు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని బాగా క‌లుపుకుంటే ప్యాక్ సిద్ధం అవుతుంది.ఇప్పుడు ముఖానికి ఏమైనా మేక‌ప్ ఉంటే పూర్తిగా తొల‌గించి గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.

ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంత‌రం నార్మ‌ల్ వాట‌ర్‌తో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.

ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే ముఖంపై ఎలాంటి మ‌చ్చలున్నా క్ర‌మంగా మాయం అవుతాయి.

టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!
Advertisement