మాధవన్ రాకెట్రీ సినిమాపై కామెంట్ చేసిన నేటిజన్.. మాధవన్ రిప్లై తో ట్వీట్ డిలీట్?

తమిళ స్టార్ హీరో మాధవన్ స్వీయ దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా తెరకెక్కిన చిత్రం రాకెట్రీ.ది నంబి ఎఫెక్ట్.

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 1వ తేదీ విడుదలై మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇకపోతే ఈ సినిమా చూసిన ప్రముఖ సెలబ్రిటీలు మాధవన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇదిలా ఉండగా తాజాగా మాధవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గురించి ఒక నెటిజన్ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు.అభయ్ అనే నెటిజన్ ఈ సినిమా గురించి స్పందిస్తూ.

రాకెట్రీ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని.మాధవన్ డైరెక్షన్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు.

Advertisement

అదేవిధంగా చివరి క్లైమాక్స్ సన్నివేశాన్ని తాను పదేపదే చూసాను.ఇక మీ నటనకు ఏమాత్రం వంక పెట్టాల్సిన పనిలేదు అంటూ మాధవన్ నటన డైరెక్షన్ పై ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ విధంగా నెటిజన్ మాధవన్ కు టాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఇక నేటిజన్ చేసిన ఈ ట్వీట్ పై మాధవన్ స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.నువ్వు ఒక్క సన్నివేశాన్ని పదేపదే ఎలా చూడగలిగావు అంటూ మాధవన్ రిప్లై ఇవ్వడంతో ఒకసారిగా నెటిజన్ తను చేసిన ట్వీట్ డిలీట్ చేశారు.అయితే అప్పటికే ఈ ట్వీట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఒక సన్నివేశాన్ని పదేపదే చూడటం కుదరదు అతను అలా చూశాడంటే తప్పకుండా పైరసీలో చూసి ఉంటారని గ్రహించిన మాధవన్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు