మనకు తెలియని ఎన్నో విషయాలను మనలో నుండి శాస్త్రవేత్తలుగా మారి కొత్త కొత్త వాటిని కనిపెడుతూ ఉంటారు.
అలాంటి శాస్త్రవేత్తలకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పుకున్నా సరిపోదు.
అలాంటి అరుదైన శాస్త్రవేత్తలలో ఒకరే ఇస్రోకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్. నంబి గురించి అందరికీ తెలియకపోయినా చాలా వరకు తెలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
అయితే ఈ శాస్త్రవేత్తపై అనవసరపు కేసును బనాయించి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి జైల్లో పెట్టి చిత్ర హింసలకు గురి చేశారు.మన దేశం కోసం శ్రమిస్తున్న ఒక సైంటిస్ట్ ను ఇతర దేశాలకు రహస్యాలను అందిస్తున్నాడన్న కారణంతో నంబి నారాయణన్ జీవితాన్ని నాశనం చేశారు.
అయితే న్యాయస్థానం దీనిపై పరిశోధన చేసిన పిమ్మట ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో అతన్ని వదిలేయడం జరిగింది.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది.
విలువైన యవ్వనం మరియు జీవితం అంతా జైలులోనే గడిపేశాడు నంబి, ఇక వృద్ధాప్యంలో బయటకి వచ్చాడు.ఇలా అన్యాయం అయిపోయిన ఒక గ్రేట్ సైంటిస్ట్ కథ ప్రముఖ హీరో మాధవన్ ను బాగా కదిలించింది.
అందుకే నంబి నారాయణన్ జీవితాన్ని కథగా మలుచుకుని సినిమాగా తీయడానికి సంకల్పించాడు.ఇందులో స్వయంగా మాధవన్ హీరోగా అంటే నంబి నారాయణన్ పాత్రలో నటిస్తూ.
సినిమాను కూడా తానే డైరెక్ట్ చేయడం మరియు నిర్మాతగా వ్యవహరించడం కొసమెరుపు.ఈ బయోపిక్ కు "రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్" అన్న టైటిల్ ను పెట్టడం జరిగింది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ అంతా పూర్తి అయ్యి వచ్చే నెల ఒకటవ తేదీన రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.నిన్ననే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.ట్రైలర్ ఈ సినిమాపై ఇంకా అంచనాలను పెంచిందని చెప్పాలి.
ఇక రిలీజ్ కు వారమే సమయం ఉండడంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మాధవన్ అండ్ టీం.ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న మాధవన్ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలిపారు.ఈ సినిమాలో రెండు కీలక పాత్రల కోసం తన ఫ్రెండ్స్ మరియు సహనటులు అయినటువంటి సూర్య మరియు షారుఖ్ ఖాన్ లను నటింపచేశారు.
అయితే ఇందుకు ముందుగా మాధవన్ వీరిని డైరెక్ట్ గా కలిసి రిక్వెస్ట్ చేశాడట.ఇందుకు వారిద్దరూ కూడా అడిగిన వెంటనే ఒప్పుకున్నారట.ఇది ఒక గమ్మత్తు అయితే.
ఈ పాన్ ఇండియా మూవీలో నటించడానికి వీరు రెమ్యూనరేషన్ గా ఒక రూపాయి కూడా తీసుకోలేదట.షూటింగ్ స్పాట్ కు వెళ్ళడానికి కూడా తమ సొంత ఖర్చులనే పెట్టుకుని వెళ్లారట.
దీనితో నెటిజన్లు వీరిని ఆకాశానికి ఎత్తేస్తున్నారట.మరి ఈ సినిమా ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వనుంది అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy