ఆనాడు ముద్దులు నేడు పిడుగుద్దులు మదనపల్లి మినీ మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ ప్రతిపక్ష నేత టిడిపి అధినేత చంద్రబాబు నేటి నుండి మూడు రోజులపాటు రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.

చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాలలో చంద్రబాబు పర్యటన కొనసాగుతూ ఉంది.

దీనిలో భాగంగా మదనపల్లిలో మినీ మహానాడు నిర్వహించగా అక్కడ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.రాష్ట్రంలో మూడు సంవత్సరాల నుండి అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఆనాడు అధికారం కోసం ఊరురా తిరిగి ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్.

నేడు అధికారంలోకి వచ్చాక పిడుగుద్దులు గుద్దుతున్నారని వ్యంగ్యంగా విమర్శ చేశారు.అమ్మబడి ఒక బూటకం ఆంగ్ల మధ్యమం ఒక నాటకం.

Advertisement

అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.మదనపల్లిలో జరిగిన మినీ మహానాడుకు.

టిడిపి కార్యకర్తలు నాయకులు భారీగా హాజరయ్యారు.ఈ సభకు హాజరవ్వడానికి హైదరాబాదు నుండి బెంగళూరు చేరుకున్న చంద్రబాబుకు.

భారీ ఎత్తున టిడిపి శ్రేణులు స్వాగతం పలికాయి.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు