ఊపు ఊపేస్తున్న మ్యాడ్ స్క్వేర్ 'స్వాతి రెడ్డి'.. (వీడియో)

గత ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘మ్యాడ్’( MAD ) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన ఈ చిత్రం, యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఆ మూవీ ఇప్పుడు సీక్వెల్ రూపంలో ‘మ్యాడ్ స్క్వేర్’గా( Mad Square ) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సీక్వెల్‌లో కూడా మొదటి భాగంలో నటించిన రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో అలరించనున్నారు.

మొదటి భాగానికి మించిన ఎంటర్‌టైన్మెంట్‌తో ఈ సీక్వెల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందుతోంది.చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సీక్వెల్‌ను కూడా డైరెక్ట్ చేస్తున్నందున సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Mad Square swathi Reddy Is Swinging, Mad Movie, Mad Square, , Swathireddy Song
Advertisement
Mad Square 'Swathi Reddy' Is Swinging, Mad Movie, Mad Square, , SwathiReddy Song

‘మ్యాడ్’ చిత్ర విజయంలో మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే.అలాగే, ‘మ్యాడ్ స్క్వేర్’కు కూడా మ్యూజిక్ బలంగా నిలుస్తోంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ "లడ్డు గాని పెళ్లి" పాటకు భారీగా స్పందన లభించింది.

ఇదే స్పీడ్ తో తాజాగా రెండో సింగిల్ "స్వాతి రెడ్డి" ( Swathi Reddy )కూడా విడుదలైంది.ఈ పాటకు సురేష్ గంగుల అద్భుతమైన లిరిక్స్ అందించగా, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తన మ్యూజిక్‌తో మరోసారి మెప్పించారు.

ఈ పాటను స్వాతి రెడ్డి, భీమ్స్ కలిసి ఆలపించారు.హీరోలైన రామ్ నితిన్, నార్నే నితిన్, ( Ram Nitin, Narne Nitin )సంగీత్ శోభన్ పాటలో కనిపించిన ఉత్సాహం ఆకట్టుకుంటుంది.

హీరోయిన్ రెబా మోనికా జాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.విజువల్స్ కూడా గొప్ప అనుభూతిని కలిగించాయి.

Mad Square swathi Reddy Is Swinging, Mad Movie, Mad Square, , Swathireddy Song
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు శామ్ దత్ ( Sam Dutt )కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా.నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

‘మ్యాడ్ స్క్వేర్’ ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది.మొదటి భాగం లాగే ఈ సీక్వెల్ కూడా ప్రేక్షకుల్ని మెప్పించి, భారీ విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి.

సీక్వెల్ విషయంలో హైప్ కొనసాగుతుండడంతో, ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.విడుదలైన పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి, ‘మ్యాడ్ స్క్వేర్’ థియేటర్లలో ప్రేక్షకులకు ఎలా అనుభూతిని కలిగిస్తుందో వేచి చూడాలి.

తాజా వార్తలు