'మా' ఓటింగ్ రికార్డ్..!

గత నెల రోజులుగా పోటా పోటీగా ప్రెస్ మీట్ లు పెట్టి మరి మా ఎన్నికల హడావిడి జరిగింది.

నేటితో ఆ ప్రెస్ మీట్ లకు ముగింపు పలికినట్టే.

మా అధ్యక్షుడి ఎన్నిక అనేది ఒకప్పుడు సినీ పెద్దలంతా చర్చించుకుని ఏకగ్రీవంగా జరిగేది.కాని ఇప్పుడు సాధారణ ఎన్నికలను తలపించేలా మా ఎలక్షన్స్ జరిగాయి.

MAA Elections Voting Record,MAA Elections , Voting Record, , Prakash Raj , Manc

ఈరోజు పోలింగ్ టైం లో కూడా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ ల మధ్య వాదులాట జరిగిన విషయం తెలిసిందే.ఇక ఎప్పుడూ లేని విధంగా ఈసారి విసృతస్థాయిలో ప్రచారం జరగడంతో అత్యధికంగా 665 మంది ఓటింగ్ చేసినట్టు తెలుస్తుంది.

దగ్గర దగ్గర 900 మంది సభ్యులు ఉన్న మా లో అంతకుముందు ఓటింగ్ కేవలం 468 ఓట్లు మాత్రమే హయ్యెస్ట్ కాగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కలిపి ఆ సంఖ్య 665 అయ్యింది.ఈసారి మా ఓటింగ్ ను వినియోగించడం కోసం ముంబై, చెన్నై, ఢిల్లీ నుండి కూడా రావడం విశేషం.

Advertisement

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్, రాం చరణ్ వంటి స్టార్స్ మా ఎన్నికల్లో తమ ఓటుని వేశారు.ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవగా రాత్రి 8, 9 గంటలకు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు