కీరవాణిని భయపెట్టిన 'చంద్రముఖి 2'.. కారణం ఇదే!

మన టాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎం ఎం కీరవాణి( M M keeravani ) ఒకరు.ఈయన గురించి చెప్పాల్సిన పని లేదు.

కొన్ని దశాబ్దాల నుండి ఈయన ప్రయాణం స్టార్ట్ అయ్యింది.ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన కీరవాణి ఆర్ఆర్ఆర్ సినిమా( RRR )కు అందించిన నాటు నాటు సాంగ్( Natu Natu Song ) తో ఇండియన్ సినిమాకు ఆస్కార్ తెచ్చాడు.

ఈ సినిమాకు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా జాతిని మరో స్థాయికి తీసుకు వెళ్లేలా ఈయన కృషి పాటుపడింది.

మరి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకు సంగీతం అందించడానికి భయపడ్డారట.ఆ సినిమా ఏంటి అంటే.? చంద్రముఖి 2 అట.కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ( Rajinikanth )కెరీర్ లో మరపురాని సినిమాలలో చంద్రముఖి ఒకటి.ఈ సినిమాను ఇప్పుడు కూడా మరోసారి చూసేందుకు ఆడియెన్స్ రెడీగా ఉంటారు.2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఈ సినిమాను పి వాసు డైరెక్ట్ చేయగా.ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ గా చంద్రముఖి 2 రాబోతుంది.18 ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 తెరకెక్కుతుండగా పాన్ ఇండియన్ లెవల్లో హర్రర్ థ్రిల్లింగ్ గా రూపొందుతుంది.

Advertisement

అయితే ఈసారి హీరోగా రజనీకాంత్ కూడా బదులుగా రాఘవ లారెన్స్( Raghava Lawrence ) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ( Kangana Ranaut )హీరోయిన్ గా నటిస్తుంది.ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతం అందించడంలోనే కీరవాణి ఇబ్బంది పడ్డారట.ఎందుకంటే ఈ సినిమాకు ముందు గురుకిరణ్, విద్యాసాగర్ సంగీతం పరంగా మార్కును సెట్ చేసారు.

ఆ మార్కును తట్టుకుని నేను పనిచేయడం కష్టం అయ్యింది అంటూ ట్యూన్స్ సమయంలో కన్ఫ్యూజన్ ఎదుర్కొన్నాను అంటూ కీరవాణి తెలిపారు.అయితే నా వంతుగా అన్నిటిని దాటుకుని సంగీతం ఇచ్చానని మీకు తప్పకుండ నచ్చుతుందని ఈయన తెలిపారు.

ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి
Advertisement

తాజా వార్తలు