కథ నాతోనే అయిపోలేదు.. జగన్‌ గురించి ఎల్వీ చెప్పిన సంగతులు విని అధికారులకు ఇక అంతే

ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తన పదవి ఎలా కోల్పోయారో తెలుసు కదా.

సీఎంవోలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌కు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో జగన్‌ ఆయనను సీఎస్‌ పదవి నుంచి తప్పించారు.

ప్రవీణ్‌ ప్రకాష్‌కు జగన్‌ అంత ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారు.అయితే తన పదవి పోయిన ఇన్నాళ్లకు ఎల్వీ సుబ్రమణ్యం కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

ఖజానాలో చిల్లిగవ్వ లేకున్నా పథకాల అమలు కోసం తమపై జగన్‌ ఒత్తిడి తెస్తున్నారంటూ ఓ 20 మంది ఐఏఎస్‌ అధికారులు ఎల్వీని కలిసినట్లు సమాచారం.ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు విని వాళ్లు షాక్‌ తిన్నారు.

ముఖ్యమంత్రి అయిన మొదట్లో తాను చెప్పినవన్నీ జగన్ విన్నారని, అయితే కొంతకాలం తర్వాత తాను ఏం చెబితే అదే చేయాలని జగన్‌ మొండిపట్టు పట్టారని ఎల్వీ సుబ్రమణ్యం ఆ అధికారులతో అన్నారు.దానికి అడ్డు వస్తున్నానన్న ఉద్దేశంతో జగన్‌ తనను తప్పించినట్లు కూడా ఎల్వీ వెల్లడించారు.

Advertisement
Lv Subramanyam Opens About Cm Ys Jagan-కథ నాతోనే అయిప�

అంతేకాదు తనలాగే మరికొందరు అధికారులు కూడా బహిరంగంగానే జగన్‌ తీరుపై నిరసన వ్యక్తం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆయన చెప్పడం గమనార్హం.నిజానికి జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎల్వీ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Lv Subramanyam Opens About Cm Ys Jagan

ఎన్నికల ముందే ఆయన రాష్ట్రానికి సీఎస్‌ అయ్యారు.జగన్‌ సీఎం అయిన తర్వాత కూడా ఆయనను ఆ పదవిలో కొనసాగించారు.అయితే సీఎంవోలో ప్రవీణ్‌ ప్రకాష్‌ అనే అధికారి పెత్తనాన్ని సహించలేని ఎల్వీ.

కేబినెట్‌ మీటింగ్‌ విషయంలో షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో ఆయన పదవి పోయినట్లు అంతా అనుకున్నారు.అయితే తన పదవి పోవడానికి అదొక్కటే కారణం కాదని తాజాగా ఆయనే బయటపెట్టడం విశేషం.

తాజా వార్తలు