భారత్‎లో చంద్రగ్రహణం ..

భారత్ లో చంద్ర గ్రహణం ప్రారంభమైంది.కాగా ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం.

గ్రహణంతో చంద్రుడు ఎర్రగా మారనున్నాడు.ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా గ్రహణ సమయంలో మార్పులు ఉన్నాయి.ఢిల్లీలో సాయంత్రం 5.28 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభంకానుంది.ముంబైలో సాయంత్రం 5.59 గంటలకు ప్రారంభం కానుంది.ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రగ్రహణం ప్రభావంతో పలు ఆలయాలు మూత పడ్డాయి.

హైదరాబాద్ లో పాక్షిక చంద్రగ్రహాణం ఏర్పడనుంది.ఈ మేరకు సాయంత్రం 5.40 గంటల నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు చంద్రగ్రహణం ఉండనుంది.విజయవాడలో సాయంత్రం 5.32 గంటల నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు, విశాఖలో సాయంత్రం 5.20 గంటల నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు గ్రహణం ఏర్పడనుంది.అటు తిరుపతిలో సాయంత్రం 5.41 గంటల నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు చంద్రగహణం సమయం.అంతేకాకుండా ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర , దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ తో పాటు పలు దేశాల్లో చంద్రగ్రహణం కనిపించనుంది.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement