విజయవాడ సమీపంలో జోరుగా జూదం..!

విజయవాడ సమీపంలో జోరుగా జూదం నడుస్తోంది.అంపాపురంలో కోడి పందాల ముసుగులో క్యాసినో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

బయట కోడి పందాలు.లోపల క్యాసినో డేరాను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులు సెక్యూరిటీగా బౌన్సర్లను సైతం పెట్టారని సమాచారం.

పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారని తెలుస్తోంది.కాగా క్యాసినో డేరాలో కోట్లు చేతులు మారుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి.

ఇంత జరుగుతున్న అటువైపు పోలీసులు కనీసం కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వరాహ పురాణంలో ఏమి ఉన్నది?