విజయనగరం జిల్లాలో లాటరీ టికెట్ల వివాదం..!

విజయనగరం జిల్లాలోని రవాణాశాఖలో లాటరీ టికెట్ల వివాదం రాజుకుంది.

ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారి పండుగ, విజయనగర ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ చిహ్నంతో ముద్రించిన లాటరీ టికెట్లను విక్రయించారు.

దీనిలో భాగంగా మూడు బహుమతులను కూడా అధికారులు ప్రకటించారు.ఈ లాటరీ టికెట్లను వాలంటీర్ల ద్వారా విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

అయితే, జిల్లా అదికారులే లాటరీ పేరుతో వ్యాపారం చేస్తున్నారంటూ పలు విమర్శలు వెల్లువెత్తాయి.దీంతో హుటాహుటిన లాటరీ టికెట్ల అమ్మకాలను అధికారులు రద్దు చేశారు.

Advertisement