ఈ రెసిపీ తో బరువు తగ్గడం చాలా సులభం..! అయితే ఇప్పుడే ట్రై చేయండి..!

ఈ మధ్యకాలంలో చాలామంది వివిధ కారణాల వలన సమతుల్య ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు.

ప్రోటీన్స్ కలిగిన ఆహారాలు ప్రతిరోజు తీసుకోకపోవడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

ఈ ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో ఊబకాయం సమస్యలు వస్తున్నాయి.దీనివలనే గుండెపోటు( heart attack )తో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.

అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆకలి నియంత్రించే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.అందుకే దానికోసం కాబూలి శెనగలు తీసుకోవడం చాలా మంచిది.

కాబూలి తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Advertisement

అయితే కాబూలి శనగలు, బచ్చలి కూర రెసిపీను అల్పాహారంలో తీసుకోవడం వలన చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు శరీర బరువును సులభంగా నియంత్రిస్తాయి.

ఆ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, దాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రెసిపీని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు శెనగపిండి, ఒక కప్పు నీరు, 1/4 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ వెల్లుల్లి పొడి, సరిపడ ఉప్పు, సరిపడ మిరియాలు, రెండు పచ్చి ఉల్లిపాయలు, ఒక కప్పు బచ్చలి కూర, ఒక కప్పు పుట్టగొడుగు( Mushroom ), ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/4 కప్పు కాబూలి శెనగలు, 1/4 కప్పు జీడిపప్పు.

ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం: ముందుగా కాబూలి శెనగలు బాగా కడిగి ఉడికించాలి.ఆ తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, బేకింగ్ పౌడర్, వెల్లుల్లి పొడి, ఉప్పు, ఎండుమిర్చి, నీరు వేసి వీటన్నిటిని మిశ్రమంలా కలపాలి.ఇక మీడియంగా వేడి బాణంగిలో పాలకూర, పుట్టగొడుగులను వేయించి అందులో సోయాసాస్ వేసి పక్కన పెట్టాలి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఇక నాన్ స్టిక్ పాన్ లో నూనె వేడి చేసి అందులో రెండు మిశ్రమాలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా మిక్స్ చేసుకున్న ఒక మూడు నిమిషాల తర్వాత ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

Advertisement

ఆ తర్వాత జీడిపప్పు( Cashew ), పనీర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

తాజా వార్తలు