Rajamouli Los Angeles Times : రాజమౌళికి దక్కిన అరుదైన గౌరవం.. లాస్ ఏంజెల్స్ టైమ్స్ పత్రికలో రాజమౌళి కవర్ పేజీ?

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రాజమౌళి ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

రాజమౌళి చివరగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఇటివలె విడుదలైన ఈ సినిమా ఈ రేంజ్ లో సాధించిందో మనందరికీ తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు కలెక్షన్ కురిపించింది.ఈ సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యారు.

కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా గ్లోబల్ వేదికలపై కూడా రాజమౌళి భారతీయ సత్తాను చాటుతున్నారు.ఇది ఇలా ఉంటే ఇటీవలే హాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా జరిగే గవర్నర్స్ అవార్డుల వేడుకలలో పాల్గొన్నారు.

Advertisement

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగే గవర్నర్ అవార్డుల కార్యక్రమానికి రాజమౌళి హాజరయ్యారు.నవంబర్ 19వ తేదీ జరిగిన ఈ వేడుకలకు రాజమౌళి హాజరయ్యారు.

జక్కన్న తన సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో పేర్లు సంపాదించుకున్న విషయం తెలిసిందే.తన సినిమాలతో ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడే విధంగా చేశారు.

ఇక ఆ వేడుకలలో రాజమౌళి సూటు బూటు ధరించి స్టైలిష్ గా కనిపించారు.కాగా హాలీవుడ్లో పలువురు ప్రముఖులు రాజమౌళిని పొగుడుతూ ట్వీట్ చేయగా ఇంకొందరు మాత్రం డైరెక్ట్గా రాజమౌళిని కలిసి అభినందిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా రాజమౌళికి మరొక అరుదైన గౌరవం దక్కింది.అదేమిటంటే అమెరికాలో ఎక్కువ సర్కులేషన్ ఉన్న పేపర్స్ లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికలో రాజమౌళి పై స్పెషల్ ఆర్టికల్ రాశారు.పత్రికలో ముందు పేజీ పూర్తిగా రాజమౌళి ఆర్టికలే కనిపిస్తోంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఆ ఆర్టికల్లో రాజమౌళిని అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రశంసిస్తూ దర్శకుడికి భారీ అవకాశాలు అని హెడ్లైన్ కూడా ఇచ్చారు.ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement