పవన పుత్రుడు ఇంకా భూమి మీద నివసిస్తన్నాడా? తన భక్తులకి ఊహించని రూపాల్లో దర్శనమిస్తూ దైవం మీద నమ్మకాన్ని పెంచుతున్నాడా? ఈ విశ్వం ఉన్నంతవరకు రామాయణం గురించి మాట్లాడుకుంటారు అంటారు, అలాగే రామాయణం గురించి జనాలు మాట్లాడుకుంటున్నంతవరకు హనుమంతుడు ఉంటాడంటారు .
మనం ఇంకా రామాయణం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం.
మరి హనుమంతుడు ఇంకా భూమి మీద ఉన్నట్టేనా? ఉంటే మన కనులకి ఎందుకు కనబడటం లేదు? అసలు ఉన్నాడా లేదా? ఈ సాక్ష్యాలు చూస్తోంటే ఉన్నాడనే అనిపిస్తోంది.* హనుమంతుడుకి ఉన్న మరోపేరు చిరంజీవి.
అంటే అర్థం ఎప్పటికీ జీవించి ఉండేవాడు.అక్కడే మనకు అర్థం అవ్వాలి, హనుమంతుడు ఎప్పటికి ఇక్కడే ఉంటాడని.
* రామాయణం పూర్తవగానే రాముడు, సీత అంతా భూమిని విడిచి వెళ్ళిపోయారు .కాని హనుమంతుడు భూమిని విడిచినట్టుగా ఎక్కడా వ్రాసిలేదు.* హనుమంతుడు సత్య యుగంలో రుద్రుడి రూపంలో ఉండేవాడు.
అంటే హనుమంతుడు త్రేతాయుగానికి ముందునుంచే మన పురాణాలకి తెలుసు.* త్రేతాయుగంలో రుద్రుడు హనుమంతుడిగా జన్మించి, అదే రూపంలో చిరంజీవిగా ఉంటాడని పురాణాలు చెప్పాయి.
ఈ యుగంలోనే రామాయణం జరిగింది.
అన్ని యుగాల్లో ఉన్నాడు, ఇకపై ఉంటాడు కాబట్టే హనుమంతుడు చిరంజీవి.* హనుమంతుడు విశ్వరూపం దాల్చిన పాదముద్రలు చాలాదేశాల్లో కనిపిస్తాయి.
అంత పెద్ద మనిషిని మనం ఎరుగం.ఆ పాదముద్రలు హనుమంతుడివి కాక ఇంకెవరివి? * తాము వానరడైన హనుంతుడిని చూసాం అని ఒకరు కాదు ఇద్దరు కాదు, వందలమంది భక్తులు చెప్పారు.ఆయన అందరికి దర్శనమివ్వడు, ఎవరో ఉంటారు అదృష్టవంతులు.
* హనుమంతుడి గుడిల దగ్గర కోతులు ఉంటాయి.వీటి వెనుక ఏం సైన్సు ఉంటుంది.
ఉదాహరణకు కొండగట్టునే తీసుకోండి.వేలకొద్ది కోతులని అక్కడకి ఎవరు రప్పించారు? అవే అక్కడే హనుమంతుడిని ఆరాధిస్తూ ఎందుకు ఉంటున్నాయి? .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy