ఈ రెండు తలల కలిగిన పిల్లిని చూడండి.. ఎంత వింతగా వుందో!

ఏంటీ, రెండు తలల కలిగిన పిల్లేమిటని అనుకుంటున్నారా? నిజమే అండీ.ఇది అల్లాటప్పా పిల్లి కూన కాదు.

ఏకంగా 2 తలలతో పుట్టిన కూన.యెంత విచిత్రంగా ఉందంటే.దీనిని కనీసం ఓ పావుగంట పరీక్షిస్తేగాని అది పిల్లని మనకు తెలియదు.

ఇక ఇలా పుట్టినవి సాధారణంగా కొన్ని గంటలు మాత్రమే జీవించగలవు.కానీ ఆదివారం థాయ్‌లాండ్‌లో పుట్టిన ఈ కూన మాత్రం నిస్సందేహంగా బతికేసింది.

పైగా ఆ 2 మూతులతోనూ పాలు తాగేస్తోందంటూ దాని యజమాని తెగ మురిసిపోతున్నాడు.దీనికి టుంగ్‌ గ్రెన్‌ (వెండి బ్యాగు), టుంగ్‌ టోంగ్‌ (బంగారు బ్యాగు) అని ఏకంగా 2 పేర్లు పెట్టుకున్నాడండీ.

Advertisement

అంటే ఒక్కో తలకు ఒక్కో పేరన్నమాట.అయితే దీని తల్లి ముందుగా ఒక సాధారణ పిల్లి కూనను కనింది.

తర్వాత రెండో కాన్పు కష్టంగా మారడంతో హుటాహుటిన స్థానిక పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారట.వాళ్లు సిజేరియన్‌ చేసి ఈ అరుదైన 2 తలల కూనను విజయవంతంగా వెలికి తీసారట.

దాంతో యజమాని ఆనందంలో మునిగిపోయాడు."వింతగా పుట్టింది.

చనిపోతుందేమోనని ముందుగా భయపడ్డా.అయితే అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదు!" అని చెప్పుకొచ్చాడు.

ఆవాల‌తో మొటిమ‌లకు సులువుగా చెక్ పెట్టేయండిలా!

ఇకపోతే, 2 తలల పిల్లుల్ని రెండు తలల రోమన్‌ దేవత జానస్‌ పేరిట జానస్‌ క్యాట్స్‌ అని పిలుస్తారు.ఏకంగా 15 ఏళ్లు బతికిన 2 తలల పిల్లి ఇది! దీని పేరు ఫ్రాంక్‌ అండ్‌ లూయీ.1999లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో పుట్టింది.అత్యధిక కాలం బతికిన జానస్‌ క్యాట్‌గా 2012లోనే ఇది గిన్నిస్‌ బుక్కులోకి ఎక్కింది.

Advertisement

అన్నట్టూ, ఇది 3 కళ్లతో పుట్టడం విశేషం.ఇలా పుట్టినవాటిని మనం వింతగా చూస్తాము.

కానీ అక్కడ వీటిని దేవతల ప్రతిరూపాలుగా చూస్తారు.