లండన్ ఇప్పుడు భారతీయులదేనా.. షాకింగ్ రిపోర్ట్ వైరల్..

కాలం మారింది, చక్రం తిరిగింది.ఒకప్పుడు పాలకులుగా ఉన్న బ్రిటీష్ ( British )వారిని వెనక్కి నెట్టి, లండన్ నగరాన్ని ఇప్పుడు భారతీయులే ఏలుతున్నారు.

ఒకప్పటి వలస పాలకుల రాజ్యంలోనే ఇప్పుడు భారతీయుల ఆస్తుల హవా కొనసాగుతోంది.బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ బారాట్ లండన్ ( Real estate firm Barratt Londo )విడుదల చేసిన తాజా నివేదిక ఆ మాటలకు నిదర్శనంగా నిలుస్తోంది.

లండన్ నగరంలో అత్యధిక సంఖ్యలో ఆస్తులు కలిగిన వారిలో భారతీయులే అగ్రస్థానంలో నిలిచారు.ఈ జాబితాలో బ్రిటన్‌లో స్థిరపడిన భారతీయ సంతతి ప్రజలతో పాటు, ఎన్నారైలు, పెట్టుబడిదారులు, విద్యార్థులు, ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లిన కుటుంబాలు కూడా ఉన్నారు.

ఒకప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యానికి గుండెకాయ లాంటి లండన్‌లో ఇప్పుడు భారతీయులదే పైచేయి కావడం విశేషం.

Advertisement

ఈ నివేదిక ప్రకారం, భారతీయులు లండన్‌లోని ఆస్తుల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.ఒక్కో ఫ్లాట్ లేదా ఇంటి కోసం దాదాపు రూ.3 కోట్ల నుంచి రూ.4.7 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.భారతీయుల తర్వాత ఆంగ్లేయులు, పాకిస్థానీయులు ఆస్తులు కలిగిన వారిలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.BRICS న్యూస్ ( BRICS News )అనే ట్విట్టర్ ఖాతా "లండన్‌లో ఆంగ్లేయులను వెనక్కి నెట్టి భారతీయులే టాప్" అంటూ పోస్ట్ చేయడంతో ఈ విషయం ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఈ పోస్ట్‌కు ఏకంగా 14 మిలియన్ వ్యూస్‌, వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి.

భారతీయులు ఈ వార్తను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు.అంతే కాదు సోషల్ మీడియాలో మీమ్స్, ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు."మేము మిమ్మల్ని తిరిగి వలస పాలిస్తున్నాం", "ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించారు, ఇప్పుడు లండన్‌లో సగానికి తక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు", "ఇది కర్మఫలం" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ లో ఆ ఒక్క పాట చూస్తే చాలు టికెట్ డబ్బులు వెనక్కి వచ్చినట్టే : ఎస్ జె సూర్య
ఉత్తరాఖండ్ సీఎం చొరవ .. ‘అడాప్ట్ ఏ విలేజ్ ’ కార్యక్రమానికి ఎన్ఆర్ఐల మద్ధతు !!

ఈ వార్త గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెరుగుతున్న భారతీయుల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు