ప‌వ‌న్ ని వెంటాడుతున్న లోకేష్ యాత్ర‌..!

ఏపీలో టీడీపీ ఫుల్ జోష్ లో ఉంది.అధినేత చంద్రబాబు జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు.

మ‌హానాడుతో వ‌చ్చిన జోష్ కంటిన్యూ చేస్తున్నారు.ఇక యంగ్ లీడ‌ర్ చిన‌బాబు కూడా దూకుడు పెంచేసాడు.

త్వ‌ర‌లోనే పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు.ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని ఏపీ మొత్తం క‌లియ‌తిర‌గ‌డానికి సిద్ద‌మవుతున్నాడు.

ఇప్ప‌టికే చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు మంచి స్పంద‌న రావ‌డంతో మ‌రింత ఉత్సాహంతో ముందుకు వెళ్లాల‌ని లోకేష్ ప్లాన్ చేస్తున్నారు.చంద్రబాబు తరువాత అంతటి స్థానంలో ఉన్న లోకేష్ వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఎలాగైనా తీసుకురావాలని చూస్తున్నారు.

Advertisement
Lokesh Yatra Chasing Pawan , Lokesh Babu , Pawan Kalyan , Janasena , TDP , Bus Y

ఈ నేపథ్యంలో ఇదే ఊపు ఎన్నికల దాకా కొనసాగాలంటే కచ్చితంగా పాదయాత్ర చేయాల్సిందే అని లోకేష్ డిసైడ్ అయినట్లుగా ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.పాదయాత్ర‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడ‌ని అంటున్నారు.

గ‌తంలో చంద్రబాబు పాదయాత్ర చేసి ఏపీలో అధికారాన్ని అందుకున్నారు.ఇపుడు అదే బాట‌లో తనయుడు లోకేష్ పాదయాత్ర చేసి సెంటిమెంట్ ని పైకితేనున్నారు.

మరోమారు బాబుని సీఎం చేసే బాధ్యతను తీసుకోనున్నారు.అయితే ఈ పాదయాత్ర వచ్చే ఏడాది మొదలవుతుంద‌ని మొదట్లో అనుకున్నా.

ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉండ‌టంతో షెడ్యూల్ బాగా ముందుకు తెచ్చిన‌ట్లు స‌మాచారం.అయితే ఈ ఆగ‌స్టు కానీ.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

అక్టోబర్ లోగాని పాదయాత్ర స్టార్ట్ చేయాలని లోకేష్ భావించారు.కానీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా బ‌స్సు యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో మ‌ళ్లీ షెడ్యూల్ మార్చిన‌ట్లు చెబుతున్నారు.

Lokesh Yatra Chasing Pawan , Lokesh Babu , Pawan Kalyan , Janasena , Tdp , Bus Y
Advertisement

ప‌వ‌న్ బ‌స్సు యాత్ర‌తో.

అయితే అక్టోబర్ 5 ద‌స‌రా నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర మొదలెట్టి ఏపీ అంతటా చుట్టేసే ప‌ని పెట్టుకోవ‌డంతో నవంబర్ నుంచి లోకేష్ పాదయాత్ర చేయాలని పార్టీలో ముహూర్తం ఫిక్స్ చేశారని అంటున్నారు.వచ్చే ఏడాదే ఎన్నికలు ఉంటాయని భావిస్తున్న‌ టీడీపీ ఎక్కడా వెనకబడిపోకుండా లోకేష్ తో పాదయాత్రకు శ్రీకారం చుట్టాల‌ని ప‌క్కా ప్లాన్ అమ‌లు చేస్తున‌ట్లు తెలుస్తోంది.

ఇక లోకేష్ పాదయాత్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చేంతవరకూ కొనసాగుతుందని అంటున్నారు.అయితే ఇదివ‌ర‌కు బాబు దాదాపు పదేళ‌ క్రితం పాదయాత్ర చేశారు.ఇప్పుడు తనయుడు లోకేష్ అదే పాదయాత్ర చేసి సెంటిమెంట్ గా ల‌బ్ది పొందాల‌ని చూస్తున్నారు.

అయితే ఈ పాద‌యాత్ర పవన్ కల్యాణ్ బస్సు యాత్ర మొదలైన నెల తర్వాత స్టార్ట్ చేసి పవన్ వెన‌కాలే లోకేష్ పాదయాత్ర సాగుతుంద‌ని అంటున్నారు.ప‌వ‌న్ యాత్ర‌ను మించేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక పాద‌యాత్ర‌ను ఎలాగైనా స‌క్సెస్ చేయాల‌ని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

తాజా వార్తలు