వచ్చే ఎన్నికలలో జగన్ చాప్టర్ క్లోజ్ అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) ఆ పార్టీ నేతలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు రిమాండ్ బెదిరించడంతో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో బెయిల్ కోసం తెలుగుదేశం పార్టీ లీగల్ టీం అదేవిధంగా లోకేష్( Nara lokesh ).అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.ఇదే సమయంలో బెంగళూరు ఇంకా హైదరాబాద్ నగరాలతో పాటు విదేశాలలో ఉన్న ఇటీ ఉద్యోగులు సైతం చంద్రబాబు అరెస్ట్ అక్రమమని నిరసనలు తెలియజేస్తున్నారు.

Lokesh Sensational Comments Saying That Jagan Chapter Will Be Closed In The Next

ఆదివారం నాడు హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరి.రాజమండ్రిలో నారా బ్రాహ్మణి( Brahmani Nara )నీ కలిసి సంఘీభావం తెలిపారు.కాగా ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు.

ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు అరెస్టు అక్రమమని నిరసనలు తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఉక్కు పాదం మోపుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Advertisement

మహా నియంతలే మట్టి కలిసిపోయారు.మీరెంతా.? మీ అధికార మదం ఎంత.? ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే దౌర్జన్యం, నిలదీస్తే నిర్బంధం.ప్రజా తిరుగుబాటుని అణిచివేయాలని చూస్తే అది ఇంకా పెరుగుతుంది.

కచ్చితంగా వచ్చే ఎన్నికలలో జగన్ దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్ అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు