డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చిన నారా లోకేష్..!!

గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఏపీ ప్రభుత్వాన్ని మాస్కు కల్పించలేదని డాక్టర్ సుధాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డటం పెను రాజకీయ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ హాస్పిటల్ లో మత్తు డాక్టర్ గా వ్యవహరిస్తున్న సుధాకర్  ఆ సమయంలో సస్పెండ్ కావటం మాత్రమే కాక తరువాత నడిరోడ్డుపై బట్టలు లేకుండా పోలీసులపై ఆయన విమర్శలు చేయడం జరిగింది.

ఈ క్రమంలో ఆయనకు మానసిక స్థితి సరిగా లేదని ఆయనను ఆసుపత్రిలో పోలీసులు జాయిన్ చేశారు.ఇదిలా ఉంటే ఇటీవల ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది.

Lokesh Sensational Comments On Dr Sudhakar Death Lokesh, Dr Sudhakar, Ap Poltics

ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొదటి నుండి ఇది ప్రభుత్వ హత్యే అని ఆరోపణలు చేస్తున్నారు.తాజాగా మరోసారి డాక్టర్ సుధాకర్ మృతి పట్ల ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుధాకర్ ఏం తప్పు చేశారో చెప్పాలని.మాస్క్ అడిగినందుకుఆయనను వేధింపులకు గురి చేసి దారుణంగా హింసించి ఆయన కుటుంబాన్ని వేధించారని పేర్కొన్నారు.

Advertisement

ఈ క్రమంలో ఆయనకు న్యాయం జరిగే లోపు మరణించారని ఆయన మరణం వెనకాల నర్సీపట్నం ఎమ్మెల్యే అదేవిధంగా వైసిపి నాయకులు ఉన్నారని లోకేష్ ఆరోపణలు చేశారు.దళితులపై దాడులు చేస్తుంటే రాష్ట్రంలో దళిత మంత్రులు ఏం చేస్తున్నారని, ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని లోకేష్ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఖచ్చితంగా డాక్టర్ సుధాకర్ కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉండి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. .

Advertisement

తాజా వార్తలు