యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగిసింది.డిసెంబర్ 19వ తారీకు విశాఖపట్నం గాజువాకలో లోకేష్ పాదయాత్ర ముగియడంతో పైలాన్ ఆవిష్కరించారు.

ఈ ఏడాది జనవరి నెలలో మొదలైన పాదయాత్ర.226 రోజులపాటు నిరంతరంగ సాగింది.మొత్తం మూడు వేల నూట ముఫై రెండు కిలోమీటర్లు నడవడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగింది.ఈ యాత్రలో చిన్నలు మొదలుకొని పెద్దలు వరకు తమ సమస్యలు లోకేష్ దృష్టికి తీసుకురావడం జరిగింది.

లోకేష్ పాదయాత్ర ముగింపు రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగుదేశం జనసేన శ్రేణులతో గాజువాక జనసంద్రం అయింది.

పైలాన్ ఆవిష్కరించిన అనంతరం లోకేష్ మాట్లాడుతూ.అసమర్థుడు అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యం పై దాడి చేశారని సీఎం జగన్ పై విమర్శలు చేశారు.

Advertisement

రాష్ట్రంలో నియంత్రత్వంపై ప్రజా యుద్ధమే ఈ యువగళం( Yuvagalam ).అన్ని స్పష్టం చేశారు.అణిచివేతకు గురైన వర్గాలకు యువగళం.

గొంతైందని పేర్కొన్నారు.యువగళం.

ప్రజాగళంగా నిర్విరామంగా సాగిందని స్పష్టం చేశారు.పాదయాత్రలో భవిష్యత్తు కోల్పోయిన యువతకు భరోసా ఇచ్చా.

యాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాను అని లోకేష్ స్పష్టం చేశారు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు