మంగళగిరి పైనే చినబాబు కన్ను ? గెలుపు ధీమా ఎందుకంటే ?

2014 అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అమరావతి కేంద్రంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.

అమరావతి రాజధానిగా ప్రకటించి , ఆ ప్రాంతంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపించింది.

అనేక తాత్కాలిక భవనాలను నిర్మించి పరిపాలన అంతా అమరావతి కేంద్రంగానే సాగించింది.ఇంతలోనే 2019 ఎన్నికలు వచ్చాయి.

ఆ ఎన్నికల్లో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని తర్జనభర్జన పడుతున్న సమయంలోనే మంగళగిరి నియోజకవర్గం తెరపైకి వచ్చింది.అమరావతి ప్రాంతంలో ఉన్న మంగళగిరిలో టిడిపికి అనుకూల పవనాలు వీస్తున్నాయని,  అభివృద్ధి సైతం అక్కడ పూర్తిస్థాయిలో చేపట్టడంతో లోకేష్ గెలుపు నల్లేరు మీద నడక అని చంద్రబాబుతో పాటు, టిడిపి ముఖ్య నాయకులు భావించారు.

ఆ నియోజకవర్గంలో 2014లో గెలిచిన జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఆళ్ల రామకృష్ణ రెడ్డి పైన 2019 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి బలంగా వీయడంతో లోకేష్ సైతం ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు.

Advertisement
Lokesh Is Preparing To Contest Again From Mangalagiri Constituency, Ysrcp, Jagan

మళ్లీ 2024 ఎన్నికల్లో లోకేష్ ను ఎక్కడ నుంచి పోటీ చేయించాలనే సందిగ్ధం నెలకొనగా మళ్లీ మంగళగిరి వైపే లోకేష్ చూస్తున్నారట.ఈ నియోజకవర్గంలో విజయం సాధించి తన సత్తా చాటుకోవాలని లోకేష్ డిసైడ్ అయిపోయారట.

అసలు ఇక్కడ లోకేష్ గెలుపు పై నమ్మకం రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి.

Lokesh Is Preparing To Contest Again From Mangalagiri Constituency, Ysrcp, Jagan

 మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ రోజురోజుకీ బలహీనపడుతుందనే సంకేతాలు రావడం , ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించకపోవడం, వైసీపీ ప్రభుత్వం పై మంగళగిరి నియోజకవర్గం లో తీవ్ర అసంతృప్తి నెలకొనడం , అమరావతి ప్రాంత రైతులు ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండడం ఇవన్నీ తన గెలుపుకు దోహదం చేస్తాయనే నమ్మకంతో లోకేష్ ఉన్నారట.అందుకే ఈ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసి ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అనే అభిప్రాయంతో లోకేష్ ఉన్నట్లు సమాచారం. .

తాజా వార్తలు