ఓటమి భయంతో లోకేశ్ ఫ్రస్టేషన్.. వైసీపీ క్యాడర్ పై దాడులు..!!

ఏపీలో ఎన్నికలు ( Elections in AP ) సమీపిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.

ఈ క్రమంలోనే ప్రతిపక్ష టీడీపీని( TDP ) ఓటమి భయం వెంటాడుతుందని తెలుస్తోంది.

బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీకి ఇప్పటికీ గెలుస్తామన్న నమ్మకం లేదని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.పరాజయం పాలవడం ఖాయమని భావిస్తున్న టీడీపీ నేతలు ఫ్రస్టేషన్ గురవుతూ.

పార్టీ క్యాడర్ ను రెచ్చగొడుతున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.ఇందుకు తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో చోటు చేసుకున్న దారుణ ఘటనే నిదర్శనమని చెబుతున్నారు.

సాధారణంగా న్యాయంగా పోరాటం చేయలేని వారు హింసను నమ్ముకుంటారు.ధర్మంగా వెళ్లి విజయం సాధించలేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతారు.

Advertisement

హింసాత్మక ఘటనలకు పాల్పడతారు.దాడులు చేసి రక్తపాతం సృష్టిస్తారు.

ఇదే తరహాలో మంగళగిరి నియోజకవర్గంలో( Mangalagiri Constituency ) ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ నేతలపై కొందరు టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు.ఈ క్రమంలోనే ఓ వైసీపీ కార్యకర్త నిండు ప్రాణాన్ని బలిగొన్నారు.

మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణమండపం( Tadepalli CSR Kalyanamandapam ) రోడ్డులో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ (వైసీపీ) పార్టీ కార్యకర్త మేకా వెంకట్ రెడ్డి( Meka Venkat Reddy ) చుట్టూ రౌడీ మూక బైకులతో తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేశారని తెలుస్తోంది.ఎందుకిలా రౌడీయిజం చేస్తున్నారని ఆయన ప్రశ్నించినందుకు బైకులతో ఢీకొట్టారు.తలకు తీవ్రగాయం కావడంతో రక్తపు మడుగులో ఉన్నా వదలని దుండగులు కాళ్లతో తన్నారని సమాచారం.

వెంటనే గమనించిన వైసీపీ కార్యకర్తలు మేకా వెంకట్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
నాగచైతన్య శోభితలను కలిపిన హీరో అతనేనా.. ఈ హీరోకు థ్యాంక్స్ అంటూ?

కేవలం ఓటమి భయంతోనే ఏం చేయాలో తెలియని ఫ్రస్టేషన్ లో లోకేశ్ ఈ విధంగా హింసకు పార్టీ క్యాడర్ ను పురిగొల్పుతున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మూడు శాఖలకు మంత్రిగా చేసినా లోకేశ్ 2019 ఎన్నికల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు.

Advertisement

ఆయనకు ధీటుగా వైసీపీ బీసీ అభ్యర్థి లావణ్యను పోటీకి దించింది.దీంతో లోకేశ్ లో ఓటమి భయం మొదలైందని కొందరు విమర్శిస్తున్నారని తెలుస్తోంది.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమని భావించిన ఆయన హింసకు దిగుతున్నారని పలువురు మండిపడుతున్నారట.

ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్త ప్రాణాన్ని బలి తీసుకోవడంపై టీడీపీపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారని తెలుస్తోంది.ఇప్పుడే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న పార్టీ క్యాడర్ మున్ముందు ఇంకెన్ని అరాచకాలు చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారని సమాచారం.

తాజా వార్తలు