లోక్‎సభ ఫలితాలు.. ఖమ్మం చరిత్రలో రికార్డ్ బ్రేక్

లోక్ సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణలో సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ( Congress , BJP ) మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఖమ్మం స్థానంలో కాంగ్రెస్ లీడ్ లో దూసుకెళ్తుంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సుమారు 2,11,914 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

ఇది యావత్ ఖమ్మం చరిత్రలోనే రికార్డ్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు.కాగా గత ఎన్నికల్లో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర రావు( Nama Nageswara Rao )కు 1,68,848 ఓట్లు వచ్చాయి.

ఈ రికార్డును ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి( Ramasahayam Raghuram Reddy ) బ్రేక్ చేశారు.

Advertisement
ఈ డ్రింక్స్ తీసుకుంటే..మీ లంగ్స్ క్లీన్ అవ్వ‌డం ఖాయం!

తాజా వార్తలు