స్థానిక పోరు:  జోరు లేని బీజేపీ-జాడ‌లేని జ‌న‌సేన ?

స్థానిక ఎన్నిక‌ల నుంచే మా స‌త్తా చాటుతాం అని గ‌డిచిన రెండు మాసాలుగా ప్ర‌క‌ట‌న‌లు గుప్పించిన బీజేపీ నేత‌లు రాష్ట్రంలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైన నాటి నుంచి ప‌త్తా లేకుండా పోయార‌నే వాద‌న వినిపిస్తోంది.

వాస్త‌వానికి సోము వీర్రాజు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాక‌ ఇంకేముంది బీజేపీని అధికారంలోకి తీసుకువ‌స్తాన‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు.

అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా పునా దులు చాలా కీల‌కం.ఈ విష‌యం బీజేపీకి తెలియంది కాదు.

ఈ క్ర‌మంలోనే స్థానికం పోరులోనూ ప్ర‌ధాన పార్టీలు నువ్వా-నేనా అనే రేంజ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి.కానీ, బీజేపీ మాత్రం స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో మౌనం పాటిస్తోంది.

Local Fighting: No Speed Bjp- Janasena No Address,ap,ap Political News,latest Ne

స్థానిక ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత ఏర్ప‌డిన వివాదాలు, ప్ర‌భుత్వం వర్సెస్ నిమ్మ‌గ‌డ్డ ర‌మ‌ష్ కుమార్‌.విష‌యాల్లో ఎక్క‌డా సోము వీర్రాజు కానీ, బీజేపీ నేత‌లు కాన.జోక్యం చేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.స‌రే ఈ వివాదంలో తాము ఎందుకు జోక్యం చేసుకోవాల‌ని అనుకున్నారో ఏమో పోనీ పంచాయ‌తీల ప‌రిధిలో అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు విష‌యంలోకానీ, పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌డం కానీ ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్ట‌లేదు.

Advertisement
Local Fighting: No Speed BJP- Janasena No Address,ap,ap Political News,latest Ne

ముఖ్యంగా తూర్పులోనూ ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.దీంతో స్థానం నుంచి బీజేపీ ప‌క్క‌కు త‌ప్ప‌కుంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.ఇక‌, బీజేపీ మిత్ర ప‌క్షం జ‌న‌సేన కూడా ఎక్క‌డా అల‌జ‌డి లేకుండా మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

పార్టీ త‌ర‌ఫున క్షేత్ర‌స్థాయిలో ఎవ‌రూ ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.కొన్నాళ్ల కింద‌ట యువ‌త ముందుకురావాల‌ని, గ్రామాల్లో అభివృద్ధి చేసేందుకు, గ్రామ స్వరాజ్యానికి ఇదే చ‌క్క‌టి అవ‌కాశ‌మ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగాల‌ను దంచికొట్టారు.

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌చోట కూడా జ‌న‌సేన త‌ర‌ఫున ఏ ఒక్క‌రూ నామినేష‌న్ వేసిన‌ట్టు వార్త‌లు రాక‌పోవ‌డం గ‌త‌మ‌నార్హం.ప్ర‌స్తుతం తొలిద‌శ నామినేష‌న్‌ల ప్ర‌క్రియ‌ప్రారంభ‌మైనా.

అటు బీజేపీకానీ, ఇటు జ‌న‌సేన కానీ దూకుడు లేకుండా ఉండ‌డాన్ని బ‌ట్టి క్షేత్ర‌స్థాయిలో వీటికి ఉన్న బ‌లం ఇంతే అంటూకామెంట్లు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.మ‌రిస్థానికంలోనే స‌త్తా చూప‌లేని వారు.

రేపు సార్వ‌త్రికంలో ఎలా దూకుడు చూపిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు