లివర్ చెడిపోవడానికి కారణాలు ఏంటో తెలుసా..?

శరీరంలో కొన్ని అవయవాలు చాలా ముఖ్యమైనవి.అదే విధంగా మన శరీరంలో లివర్ ( Liver ) కూడా అత్యంత ముఖ్యమైన అవయవం.

ఇది చేసే పనులు ఎంతో ముఖ్యమైనవి.మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్న, శరీరానికి కావాల్సిన శక్తి అందించాలన్న, అలాగే విష పదార్థాలను బయటికి తీసుకెళ్లాలి అన్న లివర్ ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

అయితే ఈ మధ్యకాలంలో మనం తింటున్న అనేక ఆహార పదార్థాల వలన లివర్ చెడిపోవడానికి( Liver Damage ) కారణం అవుతుంది.ఇప్పటివరకు కేవలం మద్యపానం, ధూమపానం వలన లివర్ చెడిపోతుందని అందరూ చెప్పుకునే వారు.

కానీ వాటితో పాటు పలు ఆహారాల పదార్థాల వలన కూడా లివర్ చెడిపోయేందుకు కారణం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.అయితే ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

చక్కెర లేదా తీపి( Sweet Foods ) అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కాలేయం దెబ్బతింటుంది.అలాగే చక్కెర అతిగా తింటే అది శరీరానికి ఉపయోగం కాకుండా అది లివర్ మొత్తం పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది.దీంతో కొంతకాలానికి లివర్ పనితీరు మందగించి చెడిపోతుంది.

నేటి తరుణంలోని ఆహార పదార్థాలను రుచిగా అందించడానికి వాటిలో మోనోసోడియం అనే పదార్థాన్ని ఎక్కువగా వాడుతున్నారు.ఈ పదార్థం ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు మన శరీరంలోకి అది ఎక్కువగా చేరుతోంది.

దీని ప్రభావం ఎక్కువగా పడడంతో లివర్ చెడిపోయే కారణం ఉంది.

విటమిన్ ఏ ఉన్న ఆహారం తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలు ఉండవని అందరికీ తెలిసిందే.అయితే ఈ విటమిన్ శరీరంలో మోతాదుకు మించి ఉన్న కూడా దాన్ని ప్రభావం లివర్ పై పడుతుంది.ఇక కూల్ డ్రింక్స్( Cool Drinks ) కూడా చాలామంది ఎక్కువగా తాగుతూ ఉంటారు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

ఇలా ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వలన కాలేయం త్వరగా చెడిపోతుంది.ఎందుకంటే కూల్ డ్రింక్స్ లో ఉండే పదార్థాలు కాలేయాన్ని పనిచేయకుండా చేస్తాయి.ఎక్కువగా ఉప్పు తినడం వలన కూడా శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుంది.

Advertisement

దీంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి.చిప్స్ లాంటి ఆహార పదార్థాలను కూడా ఎక్కువగా తింటే లివర్ ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది.

తాజా వార్తలు