భయపడుతున్న కుక్కకు ధైర్యానిచ్చిన చిన్నారి.. ఇంతకీ ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో మనకు పనికొచ్చేవి కొన్ని మాత్రమే ఉంటాయి.అందులో కొన్ని మంచి మెసేజ్‌లను ఇస్తాయి.

ఇక జంతువులు, చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలే మనకు ఎక్కువగా కనబడుతుంటాయి.అదే పెంపుడు జంతువులు ఇంట్లో ఉంటే చిన్న పిల్లలు వాటితోనే కాలక్షేపం చేస్తారు.

ఉదయం నుంచి రాత్రి పడుకునే వారకు వాటితోనే ఆడుకుంటుంటారు.వీధిలోకి వెళ్తే జంతువులను చూసి సంబుర పడుతుంటారు.

మరి కొందరు భయపడుతుంటారు.పిల్లలకు అన్నం తినిపించే సమయంలో ఇలాంటి వాటిని ఎక్కువగా చూపిస్తుంటారు.

Advertisement

కానీ ఒక పాప ధైర్యంగా కుక్క దగ్గరకు వెళ్లింది.తర్వాత ఆ కుక్కకి ధైర్యాన్ని ఇచ్చింది.

ఇంతకు ఏం జరిగిందని అనుకుంటున్నారా.

వాస్తవానికి కుక్క.శబ్ధాలను మనుషుల కంటే 25 శాతం ఎక్కువగా గ్రహించగలవు.వాటి చెవులు అంత శార్ప్ గా ఉంటాయి.

అందుకే ఏ చిన్న శబ్ధం వచ్చినా అవి వెంటనే అలర్ట్ అవుతాయి.అయితే ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆవాల‌తో మొటిమ‌లకు సులువుగా చెక్ పెట్టేయండిలా!

ఒక కుక్క రోడ్డు పక్కన కూర్చొని ఉంటుంది.దానికి సమీపంలోనే కొందరు బాణాసంచా కాలుస్తుంటారు.

Advertisement

ఆ శబ్ధాలకు కుక్కు ఆందోళనకు గురవుతోంది.దీంతో పక్కనే ఉన్న ఒక చిన్నారి కుక్క దగ్గరకు వచ్చింది.

అది భయపడటం చూసి దగ్గరకు వెళ్లి దాని చెవులు మూసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిన్నారి చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.ఆ పాపని పొగుడుతూ కామెంట్స్ సైతం చేస్తున్నారు.

అయామ్ ప్రౌండ్ ఆఫ్ యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా ఓ సారి చూసెయ్యండి.

చూస్తే మీరు సైతం ఆ పాపను పొగడకుండా ఉండలేరు.