కీర్తి సురేష్ డైలాగ్‌తో అదరగొట్టిన చిన్నారి.. వైరల్ గా మారిన వీడియో

ఇటీవల సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ వీడియోలు( Dubsmash ) బాగా వైరల్ అవుతున్నాయి.

సెలబ్రెటీలు చేసినట్లుగానే డైలాగ్ చెప్పడం, వాళ్లు ఇచ్చినట్లుగానే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు కొంతమంది.

సినిమాల్లోని డైలాగ్స్, పాటలు, డ్యాన్స్‌లో అందులో హీరోలు చేసినట్లుగా చేసి సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు.ఇలా సోషల్ మీడియాలో పాపులర్ అయినవారు ఎందరో ఉన్నారు.

వీటి వల్ల సినిమాలకు కూడా ప్రమోషన్స్ లభిస్తున్నాయి.తమ నచ్చిన హీరోలను కొంతమంది స్పూర్తిగా తీసుకుని ఇలా చేస్తోన్నారు.

తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక చిన్నారి చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.కొద్ది నెలల క్రితం నేచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ( Dasara Movie ) రిలీజ్ అయిన సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

ఈ సినిమాలో కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా నటించగా.అందులోని సాంగ్స్, డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి.అందులోని చమ్కీలా అంగీలేసి సాంగ్ బాగా పాపులర్ అయింది.

ఈ సాంగ్ కు చాలామంది డబ్‌స్మాష్ వీడియోలు చేశారు.ఇవి కూడా సోషల్ మీడియా బాగా వైరల్ అయ్యాయి.

తాజాగా దసరా సినిమాలో కీర్తి సురేష్ చెప్పిన ఓ డైలాగ్ ను ఒక చిన్నారి ఇమిటేట్ చేసింది.కీర్తి సురేష్ లా చున్నీని చీరలా కట్టుకుని నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ఒక మహిళతో డైలాగ్ చెప్పింది.సూరిగాడు ఉన్నడా అత్తా అంటూ వయ్యారంగా నడుమును కదిలిస్తూ అడిగింది.

దీనికి మహిళ కూడా డైలాగ్ చెప్పినట్లు లిప్ మూమెంట్ ఇస్తుంది.వెంకీ కిన్నానా అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో దీనిని షేర్ చేశాడు.

Ashwini Dutt : నా కెరీర్ లో అత్యంత లాభాలు పొందిన సినిమా అదే

ఈ వీడియోలో చిన్నారి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ క్యూట్ గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు