తల్లి ప్రాణాలను రెప్పపాటులో కాపాడిన చిన్నారి.. వీడియో వైరల్..

సాధారణంగా పిల్లలకు ఏదైనా ఆపద వస్తే తల్లి వెంటనే కాపడుతుంది.అదే తల్లికి ఆపద వస్తే పిల్లలు కూడా కాపాడుతుంటారు.

కానీ వారిది చాలా చిన్న వయసు అయితే తల్లులను కాపాడుకోవడం అసాధ్యమని చెప్పొచ్చు.కాగా తాజాగా చాలా చిన్న వయసు ఉన్న ఒక బాలుడు మాత్రం తన తల్లి డేంజర్‌లో పడిందని తెలుసుకున్నాడు.

ఆపై వెంటనే సహాయం చేసి ఆమెను కాపాడాడు.అతడు రావడం కొంచెం ఆలస్యమైనా లేదా హెల్ప్ చేయకపోయినా ఆ తల్లి దాదాపు 10 అడుగుల ఎత్తు నుంచి కింద పడి గాయాల పాలయ్యేది.

కానీ ఆ ముప్పు ఆమెకు జరగకుండా బాలుడు చాలా వేగంగా స్పందించాడు.దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్రా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

Advertisement

"తల్లి గ్యారేజ్ డోర్ రిపేర్ చేస్తుండగా నిచ్చెన పడిపోయింది.పైన వేలాడుతున్న తల్లిని చూసిన పిల్లవాడు నిచ్చెనను తిరిగి పైకి నిలబెట్టాడు.

అలా ఆమెకు సహాయం చేశాడు.ఈ చిన్న పిల్లవాడి తెలివి, ధైర్యాన్ని ఎంత కొనియాడినా తక్కువే.

" అని దీపాన్షు కాబ్రా ఒక క్యాప్షన్ కూడా జత చేశారు.డిసెంబర్ 23న షేర్ చేసిన ఈ 42 సెకన్ల వీడియోకి ఇప్పటికే ఒక లక్ష పదివేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియోలో ఓ మహిళ నిచ్చెన పైకి ఎక్కి గ్యారేజ్ డోర్ రిపేర్ చేయడం గమనించవచ్చు.తర్వాత ఆమె బ్యాలెన్స్ కోల్పోతుంది.అదే సమయంలో అనుకోకుండా నిచ్చెనను దూరంగా కాళ్లతో తోసింది.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

పక్కనే నిలబడి ఉన్న పిల్లవాడు తన తల్లి పై చెక్కకు వేలాడుతున్నట్లు గమనించాడు.ఆమె ఏ క్షణంలోనైనా పడిపోయేలా మొత్తుకుంటుంది.

Advertisement

దాంతో అతను వేగంగా స్పందించాడు.తన చిన్న చేతులతో భారీ నిచ్చెనను పైకి నిలబెట్టాడు.

దాంతో తల్లి ఆ నిచ్చెనపై మళ్లీ నిలబడగలిగింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు బాలుడిని బాగా పొగుడుతున్నారు.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.