విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోగా అనన్య పాండే( Ananya Pandey ) హీరోయిన్ గా రూపొందిన లైగర్ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆ సినిమా పై నమ్మకంతో పూరి జగన్నాధ్ చాలా ఖర్చు పెట్టాడు.
ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరించింది.సినిమాకు పాన్ ఇండియా మూవీ అంటూ ప్రచారం చేయడంతో భారీగానే బిజినెస్ అయ్యింది.
కానీ సినిమా వసూళ్ల విషయంలో తీవ్రంగా నిరాశ పర్చింది.
ఆశించిన కలెక్షన్స్ లో కనీసం 10 శాతం కూడా రాబట్టలేక పోయింది.దాంతో లైగర్ సినిమా( Liger movie ) ను కొనుగోలు చేసిన వారు ఎంతో మంది ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు.దాదాపు ఏడాది కాలంగా వారు ఆందోళన చేస్తూనే ఉన్నారు.
అయినా కూడా మేకర్స్ నుండి ఎలాంటి స్పష్టత రాలేదు.ముఖ్యంగా నైజాం ఏరియా ఎగ్జిబీటర్స్( Nizam Area Exhibitors ) పరిస్థితి దారుణంగా ఉంది అంటూ ఆందోళనలు చేస్తున్నారు.
ఒక వైపు పూరి మరో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండగా లైగర్ ఎఫెక్ట్ నుండి ఆయన ఇప్పట్లో బయట పడే పరిస్థితి లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.లైగర్ గొడవలు ముందు ముందు అయినా సర్దుమనిగితే పూరి జగన్నాధ్ తదుపరి సినిమా విషయంలో శ్రద్ద పెడుతాడు అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఛార్మి( Charmy ) గత కొంత కాలంగా ఈ విషయమై గొడవ లేకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల కూడా డిస్ట్రిబ్యూటర్లకు మరియు అందరికి కూడా తప్పకుండా న్యాయం చేస్తాం అన్నట్లుగా హామీ ఇచ్చింది.అయినా కూడా ఆందోళన విరమించలేదు.ఈ లైగర్ గొడవలు ఆందోళనలు ఎన్నాళ్లు సాగుతాయో అర్థం కావడం లేదు.
వారికి సెటిల్ చేయాలి అంటే కనీసం పాతిక కోట్లు అవసరం ఉంటుందని తెలుస్తతోంది.మరి అంత ఉందా అంటే అనుమానమే అనే చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy