తమ పాలసీలను పునరుద్ధరించాలనుకునే వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) బంపరాఫర్ అందించింది.
తమ పాలసీదారులకు తిరిగి కొనసాగించాలనుకునేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని ప్రకటించింది.
వ్యక్తిగత ల్యాప్స్ అయిన ఎల్ఐసీ పాలసీలను పునరుద్ధరించడానికి బీమా సంస్థ తన కస్టమర్ల కోసం ఒక విలక్షణమైన ప్రత్యేక పునరుద్ధరణ క్యాంపెయిన్‌ను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది.ఆగస్టు 17 నుంచి ఇది ప్రారంభమవుతుంది.
అక్టోబర్ 21, 2022 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.అనుకోని పరిస్థితుల వల్ల ప్రీమియంలు చెల్లించలేకపోయిన, పాలసీ ల్యాప్ అయిన వారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడనుంది.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మన కుటుంబ సభ్యులకు భరోసానిస్తుంది.
అందుకే చాలా మంది తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం ఎల్ఐసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కడుతుంటారు.కొన్ని సార్లు అనుకోని కారణాల వల్ల పాలసీలు మధ్యలోనే కొందరు ఆపేస్తుంటారు.
అలాంటి వారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్ అందించింది.పాలసీ హోల్డర్‌లకు వారి ల్యాప్ అయిన పాలసీలను పునరుద్ధరించడానికి, వారి కుటుంబ ఆర్థిక ప్రయోజనాలను రక్షించడానికి ఎల్ఐసీ మంచి అవకాశాన్ని అందిస్తోంది.
బీమా ప్రయోజనాలను కొనసాగించడానికి అరుదైన అవకాశాన్ని ఇచ్చింది.
ULIP పాలసీలు మినహా, అన్ని పాలసీలు పాలసీ షరతులకు లోబడి మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి 5 సంవత్సరాలలోపు ఉన్నవి పునరుద్ధరించబడతాయి.రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, రూ.1 లక్ష వరకు మొత్తం స్వీకరించదగిన ప్రీమియం 25% ఆలస్య రుసుము రాయితీని కలిగి ఉంటుంది.గరిష్టంగా రూ.2,500 వరకు అనుమతించబడుతుంది.ఇంకా రూ.1,00,001 నుండి రూ.3 లక్షల మధ్య స్వీకరించదగిన ప్రీమియంల కోసం, ఆలస్య రుసుము రాయితీ 25% లాగానే ఉంటుంది కానీ గరిష్టంగా రూ.3,000 రాయితీ ఉంటుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy