కార్నీ ఎఫెక్ట్ .. లిబరల్స్‌దే ఆధిపత్యం , వెలుగులోకి సంచలన నివేదిక

కెనడాలో( Canada ) ఈ నెలాఖరులో ఫెడరల్ ఎన్నికలు( Federal Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.

షెడ్యూల్ ప్రకారం అక్టోబర్‌లో జరగాల్సిన ఎన్నికలు ముందే జరగనున్నాయి.

మార్క్ కార్నీ( Canada PM Mark Carney ) కెనడా ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.ఎన్నికల్లో ఆయన లిబరల్స్‌ను( Liberals ) ఎలా నడిపిస్తారోనని కెనడా వాసులు కూడా ఉత్కంఠగా గమనిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో( US President Donald Trump ) వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారోనని ఆసక్తిగా ఉంది.ఎన్నికల నేపథ్యంలో అనేక సర్వేలు వెలుగులోకి వస్తున్నాయి.ట్రూడో( Trudeau ) అధికారంలో ఉన్నప్పుడు కన్జర్వేటివ్స్ ఆధిక్యంలో నిలిచారు.2024-25 ప్రారంభ నెలల్లో వెలువడిన సర్వేల్లో కన్జర్వేటివ్స్ ఏకంగా 20 పాయింట్లతో ముందంజలో ఉన్నారు.అయితే ట్రూడో రాజీనామా, మార్క్ కార్నీ లిబరల్ పార్టీ నేతగా సారథ్యం వహించడంతో రాజకీయం ఊహించని మలుపు తిరిగింది.

అనుభవజ్ఞుడైన ఆర్ధికవేత్తగా, వ్యూహకర్తగా ప్రఖ్యాతి గాంచిన కార్నీ రాకతో లిబరల్స్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది.ఇది ప్రతినెలా కన్జర్వేటివ్‌ల ఆధిక్యం క్షీణిస్తూ వచ్చింది.

Advertisement

మెయిన్‌స్ట్రీట్ రీసెర్చ్ ఏప్రిల్ 17న నిర్వహించిన పోల్‌లో లిబరల్స్‌కు 43.5 శాతం మంది ఓటర్లు మద్ధతు పలుకుతున్నట్లుగా తెలిపింది.అలాగే 183 స్థానాల్లో లిబరల్స్ గెలుస్తారని సర్వే అంచనా వేసింది.ఇక ఎన్నికల్లో కన్జర్వేటివ్స్‌( Conservatives ) 40 శాతం మంది ఓటర్లు మద్ధతు పలుకుతారని.135 సీట్లు గెలుచుకుంటారని పేర్కొంది.ఇది లిబరల్స్‌కు మెజారిటీ ప్రభుత్వాన్ని కైవసం చేసుకునేందుకు 72.6 శాతం అవకాశాన్ని ఇస్తుందని అంచనా వేసింది.ఆర్ధిక వ్యవహారాల్లో ముఖ్యంగా అమెరికాలో వాణిజ్య ఉద్రిక్తతలను ఎదుర్కోవడంలో కార్నీ సామర్ధ్యం లిబరల్స్‌కు వరంగా మారింది.

ఇక మార్క్ కార్నీ.కన్జర్వేటివ్ నేత పియరీ పొయిలివ్రే( Conservative leader Pierre Poilievre ) మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతుందని సర్వే తెలిపింది.నానోస్ రీసెర్చ్ పోల్ కార్నీ ఆధిపత్యాన్ని స్పష్టంగా పేర్కొంది.

అమెరికాతో వాణిజ్య చర్చలు, సున్నితమైన అంశాలపై చర్చలు నిర్వహించడానికి మీరు ఎవరికి ఎక్కువగా విశ్వసిస్తారని ఓటర్లను అడగ్గా కార్నీ పొయిలివ్రే ముందంజలో ఉన్నాడని సర్వే తెలిపింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు, వాణిజ్య , ఆర్ధిక అంశాలపై కెనడా పోరాడుతున్న నేపథ్యంలో ఇవి కెనడా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు