పార్టీల మ‌ధ్య చిచ్చు రేపుతున్న ఆ సామాజిక వ‌ర్గం లేఖ‌..!

ఏపీ రాజ‌కీయాల్లో కులాల‌ది అగ్ర తాంబూలం అని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.కేవ‌లం కొన్ని కులాలు మాత్ర‌మే రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి.

అందులో మ‌రీ ముఖ్యంగా క‌మ్మ‌, రెడ్లు బ‌లంగా ఉన్నాయి.ఇక కాపు, క్ష‌త్రియ కులాలు వీటిని శాసిస్తున్నాయి.

అయితే ఏపీలో మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్న‌ట్టు ఉన్న రాజ‌కీయాలు కాస్తా ఇప్పుడు కులాల మీద‌కు మ‌ళ్లాయి.అందుకు ముఖ్య కార‌ణం టీడీపీ మాజీ ఎంపీ అయిన అశోక్ గ‌జ‌ప‌తి రాజును ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి విమ‌ర్శించ‌డ‌మే.

దీంతో క్ష‌త్రియ కుల సామాజిక వ‌ర్గం దీన్ని వ్య‌తిరేకిస్తోంది.ఈ నేప‌థ్యంలో రీసెంట్‌గా వైసీపీ నేత‌లు త‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మాన్సాస్ ట్ర‌స్టు అధినేత గ‌జ‌ప‌తిరాజుపై చేసిన ఆరోప‌ణ‌లు అమ‌ర్యాద పూర్వ‌కంగా ఉన్నాయంటూ ఓ లేఖ‌ను విడుద‌ల చేసింది.

Advertisement
Letter From That Social Group That Is Causing A Rift Between The Parties ..!, Td

ఈ లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.పార్టీల వారీగా వ‌ర్గ‌పోరుకు దిగుతున్నారు క్ష‌త్రియ నేత‌లు.

త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారిపైనే ఆ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

Letter From That Social Group That Is Causing A Rift Between The Parties .., Td

అయితే క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు విడుద‌ల చేసిన ఆ లేఖ కాస్తా వైసీపీకి కౌంటర్ వేసిన‌ట్టే ఉన్న‌ట్టు స‌మాచారం.ఇక దీనిపై వేరే సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు మాట్లాడితే బాగుండ‌ద‌ని భావించిన వైసీపీ క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రి రంగనాథరాజుతోనే కౌంట‌ర్ విసిరింది.ఆయ‌న నిన్న మాట్లాడుతూ క్షత్రియుల పేరుతో విడుద‌ల చేసిన లేఖ అస‌లు ఎవరిదో కూడా తెలియ‌కుండా అర్థం కాకుండా ఉంద‌న్నారు.

ఆ లేఖ‌ను విడుద‌ల చేసింది నిజ‌మైన క్ష‌త్రియులేనా అని ప్ర‌శ్నించారు.ఆ లేఖ‌ను విడుద‌ల చేసిన సంగం ఓ పార్టీకి కొమ్ముకాస్తూ ఇచ్చిన మద్దతుగా అర్థ‌మ‌వుతోంద‌ని అభిప్రాయపడ్డారు మంత్రి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజకీయ అంశాలకు కులపరమైన అంశాన్ని జోడించాల‌ని చూస్తున్నార‌ని తెలిపారు.అశోక్ గజపతిరాజు ఒక‌వేళ నిజాయితీ ప‌రుడైన వ్య‌క్తి అయితే క్షత్రియురాలైన సంచయితకు అన్యాయం ఎలా చేశార‌ని మండిప‌డ్డాడు.

Advertisement

ఇక మంత్రి మాట‌ల‌తో అటు టీడీపీ కూడా భ‌గ్గుమంటోంది.

తాజా వార్తలు