పిల్లలకు రోబోతో పాఠాలు... ప్రొఫెసర్ ఐడియాకి ఫిదా!

ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.నేటి దైననందిత జీవితంలో మనిషి అనేవాడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టెక్నాలజీపైన ఆధారపడవల్సిన పరిస్థితి.

ఈ క్రమంలోనే కొత్త కొత్తగా స్మార్ట్ ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి.ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టిస్తోంది.

దీనితో ఉత్పాదకత పెరిగి, ఎక్కువ మంది చేసే పనులను రోబో అతిసునాయసంగా తక్కువ సమయంలో చేసేస్తోంది.కొన్ని షోరూమ్ లు, హోటల్స్ లలో, ఇంట్లో పనులు చేయడానికి ఇప్పటికే ఆర్టిఫిషియల్ రోబోలను కొన్ని కొన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు.

అంతేకాకుండా ప్రమాదకర ప్రదేశాలలో కూడా రోబోలను వాడుతున్నారు.

Advertisement

తాజాగా అలాంటి ఓ ఘటనకు సంబంధించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఒక స్కూల్ లో రోబో ఏకంగా పిల్లలకు పాఠాలను బోధిస్తుంది.ఉత్తర కన్నడలో స్థానికంగా ఉన్న షిర్సీ ప్రాంతంలో ఉన్న MES చైతన్య కాలేజీలో అక్షయ్ మషేల్కర్ ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఆయన తన స్కూల్ పిల్లలకు చాలా వినూత్న రీతిలో పాఠాలు చెబుతుంటారు.అందుకే ఆయనంటే సదరు పాఠశాలలోని పిల్లలకు మక్కువ ఎక్కువ.ఈ క్రమంలో ఆయన కాస్త వినూత్నంగా ఆలోచించారు.

పిల్లలకు రోబోట్ తో పాఠాలు చెప్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు.

అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు.తన శిష్యుడైన ఆదర్శ్ దేవడిగ నిర్మించిన ఈ రోబోట్ ను స్కూల్ కు తీసుకొచ్చేసాడు.దానిలో ఎలక్ట్రిక్ పవర్డ్ రోబో, దీనిలో ముందుగానే అనేక రకాల సెన్సార్లు ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)

పిల్లలకు బోధించాల్సిన సిలబస్, అనేక రకాల కాంపిటిషన్స్ లను అందులో ముందుగా ఇన్ స్టాల్ చేశారు.అంతే కాకుండా.ఈ బొమ్మటీచర్ చెబుతున్న పాఠాలను స్కూల్ లోని విద్యార్థులు కూడా ఎంతో శ్రద్ధతో వింటున్నారని సమాచారం.

Advertisement

ఇప్పటి వరకు కరోనా వలన ఫోన్ లలో పాఠాలు విన్న స్టూడెంట్స్ ప్రస్తుతం, రోబో టీచర్ చెబుతున్న పాఠాలు వింటుండటం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదూ.

తాజా వార్తలు