నిమ్మ తొక్క‌ల‌తో ఇలా చేస్తే.. పొట్ట చుట్టూ కొవ్వు క‌ర‌గ‌డం ఖాయం?

పొట్ట‌ చుట్టూ కొవ్వు (బెల్లీ ఫ్యాట్‌) ఉన్న వారి బాధ వ‌ర్ణ‌ణాతీతం.పొట్ట చుట్టూ కొవ్వు పెర‌గ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.

ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామాలు చేయ‌క‌పోవ‌డం, ఆల్కహాల్ సేవించ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల శ‌రీరంలో కొవ్వులు నిల్వ‌గా మార‌తాయి.అవి పొట్ట‌ చుట్టూ పేరుకుని.

అధిక బ‌రువుకు దారి తీస్తుంది.ఇక పొట్ట చుట్టూ కొవ్వు ఉన్న వారు.

దానిని క‌రిగించుకునేందుకు నానా పాట్లు ప‌డుతుంటారు.తిన‌డం మానేసి మ‌రీ.

Advertisement

తీవ్రంగా శ్ర‌మిస్తారు.అయిన‌ప్ప‌టికీ పొట్ట చుట్టూ కొవ్వు త‌గ్గ‌కుంటే.

తెగ బాధ ప‌డ‌తాయి.అయితే అలాంటి వారికి నిమ్మ తొక్క‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

సాధార‌ణంగా అంద‌రూ చేసే పొర‌పాటు నిమ్మకాయ‌లోని ర‌సం తీసుకుని తొక్క‌ల‌ను పాడేస్తుంటారు.కానీ, నిమ్మ తొక్క‌లు కూడా ఆరోగ్య ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ త‌గ్గాలి అని భావించేవారు.రెండు లేదా మూడు నిమ్మ‌కాయ‌ల‌ను తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఆ నిమ్మ‌కాయ‌ల్లో ర‌సం తీసేసి.తొక్క‌ల‌ను మాత్రం ఒక బౌల్‌లో వేసుకుని ఒక గ్లాస్ నీరు పోసి బాగా హీట్ చేసుకోవాలి.అనంతరం, ఆ నీటిని వ‌డ‌గ‌ట్టుకుని.

Advertisement

గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు కొద్దిగా తేనె, నిమ్మ‌ర‌సం యాడ్ చేసి సేవించాలి.ఇలా ప్ర‌తి రోజు ఉద‌యాన్నే మ‌రియు మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసే గంట ముందు సేవిస్తే.

పొట్ట చుట్టూ కొవ్వు క్ర‌మంగా త‌గ్గిపోతుంది.అలాగే పైన చెప్పుకున్న డ్రింక్‌ను రెగ్యుల‌ర్‌గా సేవించ‌డం వ‌ల్ల‌.

నిమ్మ తొక్క‌ల్లో ఉండే పొటాషియం మ‌రియు ఇత‌ర పోష‌కాలు గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ర‌క్షిస్తుంది.అలాగే, మ‌ధుమేహం వ‌చ్చే రిస్క్‌ను త‌గ్గిస్తుంది.

మ‌రియు శ‌రీరంలో పేరుకుపోయి ఉన్న మ‌లినాలు కూడా బ‌య‌ట‌కు పంపుతుంది.కాబ‌ట్టి, ఇప్పుడు చెప్పుకున్న నిమ్మ తొక్క‌ల డ్రింక్ ప్ర‌తి రోజు తీసుకోండి.

తాజా వార్తలు