వ‌ర్షాకాలంలో వేధించే క‌ఫానికి నిమ్మ‌తో చెక్ పెట్టండిలా!

వ‌ర్షాకాలంలో అత్య‌ధికంగా వేధించే స‌మ‌స్య‌ల్లో క‌ఫం ఒక‌టి.ఈ క‌ఫం ఎక్కువ‌గా శ్వాస కోశాల్లోనూ, శ్వాస వాహికల్లోనూ, ముక్కుల్లోనూ పేరుకుపోతుంది.

దాంతో గొంతులో గ‌ర గ‌ర‌, శ్వాస తీసుకోలేక‌పోవ‌డం, తీవ్ర‌మైన అసౌక‌ర్యం, గుర‌క‌, వికారం, ద‌గ్గు ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది.అందుకే క‌ఫాన్ని నివారించుకునేందుకు నానా పాట్లు ప‌డుతుంటారు.

ప‌లు మందులు కూడా వాడుతుంటారు.అయితే ఇంట్లోనే కొన్ని కొన్ని సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే.సులువుగా క‌ఫాన్ని నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.నిమ్మ‌ క‌ఫానికి చెక్ పెట్ట‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటితో రెండు స్పూన్ల నిమ్మ ర‌సం, చిటికెడు ఉప్పు మ‌రియు చిటికెడు మిరియాల పొడి వేసి బాగా క‌లిపి సేవించాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే క‌ఫం క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డుతుంది.

అలాగే ద్రాక్ష పండ్లూ క‌ఫాన్ని త‌గ్గించ‌గ‌ల‌వు.ద్రాక్ష పండ్ల నుంచి ర‌సాన్ని త‌యారు చేసుకుని తీసుకుంటే క‌ఫం అంత త‌గ్గి ఊపిరితిత్తులు ఫ్రీగా మార‌తాయి.

ఊపిరితిత్తులకు ఉపశమనాన్నిచ్చి కఫాన్ని నివారించ‌డంలో ముల్లంగి కూడా గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది. ముల్లంగి ముక్క‌ల‌ను మెత్త‌గా పేస్ట్ చేసుకునిర‌సం తీసుకోవాలి.ఈ ర‌సాన్ని రోజుకు ఒక సారి తీసుకుంటే క‌ఫం స‌మ‌స్యే ఉండ‌దు.

క‌ఫంతో బాధ ప‌డే వారు వాట‌ర్ ఎక్కువ తీసుకోవాలి.రోజుకు క‌నీసం రెండు నుంచి మూడు లీట‌ర్ల వాట‌ర్ తీసుకుంటే.శ్వాస కోశాల్లోనూ, శ్వాస వాహికల్లోనూ పేరుకు పోయిన క‌ఫం క‌రిగి పోతుంది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇక ఈ టిప్స్‌తో పాటుగా క‌ఫం స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డే వారు పాలు, పాల ఉత్ప‌త్తులకు దూరంగా ఉండాలి.మ‌రియు ఆయిలీ ఫుడ్‌, ఫాస్ట్ ఫుడ్‌, పంది మాంసం వంటి వాటిని కూడా డైట్ నుంచి క‌ట్ చేయాలి.

Advertisement

ఎందుకంటే, ఇవి క‌ఫాన్ని త‌గ్గించ‌క‌పోగా.మ‌రింత పెంచుతాయి.

తాజా వార్తలు