నాయకులు కార్యకర్తలతో ఉండాలి నాగబాబు సంచలన పోస్ట్..!!

జనసేన పార్టీ( Janasena ) ప్రధాన కార్యదర్శి నాగబాబు( Nagababu ) కీలక ప్రకటన చేశారు.

నాయకులు నిత్యం కార్యకర్తలతో మమేకం కావాలని హెడ్డింగ్ తో ప్రకటన విడుదల చేశారు.

త్వరలోనే వర్చువల్ గా అందరితో మాట్లాడబోతున్నట్లు స్పష్టం చేశారు.ఇంకా ఆ ప్రకటనలో.

"జిల్లా, నియోజకవర్గం బాధ్యులు, నాయకులు నిత్యం క్షేత్రస్థాయి కార్యకర్తలతో మమేకమై పని చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు స్పష్టం చేశారు.

జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రతీ కార్యకర్తతో "వర్చువల్"గా మాట్లాడుతానని వెల్లడించారు.శుక్రవారం "వర్చువల్" సమావేశం( Virtual Meeting ) ద్వారా కొందరు నాయకులతో శ్రీ నాగబాబు గారు మాట్లాడారు.అతి త్వరలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ఇలాంటి వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తాం అని అన్నారు.ప్రతీ గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పని చేయడం,

Advertisement

జనసేన ప్రభుత్వంలో ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన అందించే అంశాలపై "వర్చువల్" సమావేశాల్లో చర్చిస్తామని పేర్కొన్నారు.ప్రతీ కార్యకర్త "వర్చువల్" సమావేశంలో పాల్గొని స్థానిక సమస్యలు, పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడే అవకాశం కల్పించాలని నాయకులకు సూచించారు."వర్చువల్" సమావేశాల్లో పాల్గొంటూనే నియోజకవర్గ పర్యటనలు చేపడతామని నాగబాబు పేర్కొన్నారు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement

తాజా వార్తలు