నేను అడిగితే ఏ పదవి అయినా ఇచ్చేవారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల లక్ష్మీ పార్వతికి తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే.

ఈ పదవితో లక్ష్మీ పార్వతికి క్యాబినెట్‌ హోదా దక్కింది.

తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌ హోదాలో ఈమె మొదటి ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను ఆమె చెప్పుకొచ్చారు.

Laxmi Parvathi Comments On Jagan Mohan Reddy-నేను అడిగితే

ఎన్టీఆర్‌ ఉన్నప్పటి నుండి తాను ఎదుర్కొన్న అవమానాలు మరియు బాధలను గురించి ఆమె తీవ్ర ఆవేదనతో చెప్పుకొచ్చారు.జగన్‌ బాబు నాపై చాలా అభిమానం చూపించాడు.

నేను పార్టీ కోసం పని చేసినందుకు ఆయన మంచి పదవిని ఆఫర్‌ చేశారు.ఎమ్మెల్సీ పదవిని కూడా ఇచ్చేందుకు ఆయన సిద్దంగా ఉన్నారు.

Advertisement

కాని నాకు మొదటి నుండి కూడా తెలుగు భాష మరియు సంస్కృతి అంటే ఇష్టం కనుక ఈ పదవిని నేను చేపట్టేందుకు సిద్దం అయ్యాను.ఇంత చిన్న పదవిని ఆమెకు ఇస్తే ఏమంటారో అంటూ జగన్‌ గారు సన్నిహితుల వద్ద మాట్లాడాడరట.

ఆ సమయంలో ఆమెకు ఇష్టమైన పదవి ఇవ్వాలంటే ఆమెకు ఏది ఇష్టం అయితే దాంట్లోనే ఆమెకు ప్రాముఖ్యత కలిగించాలంటూ సూచించాడట.

Advertisement

తాజా వార్తలు