చిరంజీవి గురువు కాళ్లు మొక్కిన లావణ్య త్రిపాఠి.. గౌరవించే విషయంలో ఈమెకు ఎవరూ సాటిరారంటూ?

టాలీవుడ్( Tollywood ) మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీల( Lavanya Tripathi ) పెళ్లి ఇటీవల నవంబర్ 1వ తేదీన ఇటలీ లో జరిగిన విషయం తెలిసిందే.

ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితులు అలాగే పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఈ జంట మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.

లావణ్య,వరుణ్ తేజ్ లది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే.పెళ్లి ఇటలీలో( Italy ) కావడంతో కేవలం కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు.

తాజాగా ఆదివారం రోజున హైదరాబాదులో వీరి రిసెప్షన్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు( Celebrities ) హాజరయ్యారు.దర్శకులు నిర్మాతలు హీరో హీరోయిన్లు లు హాజరయ్యి నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వారిని దీవించారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు పడుతున్నాయి.

Advertisement

అయితే కొందరు కొత్తజంటకు కరచాలనం చేసి కొందరు హత్తుకొని, మరికొందరు బొకేలు గిఫ్టులు ఇచ్చి శుభాకాంక్షలు అనంతరం వారితో ఫోటోలు కూడా దిగారు.ఈ నేపథ్యంలోనే లావణ్య చేసిన పనికి లావణ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఒక ఇద్దరు వ్యక్తులు వేదిక మీదకు వెళ్ళగానే లావణ్య వారి పాదాలకు నమస్కరించింది.

ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు ఒకరు ప్రముఖ నట గురువు సత్యానంద్( Guru Satyanand ) కాగా, మరొకరు మెగాస్టార్ చిరంజీవి.మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్‌లకు సత్యానంద్ మాస్టారు నటనా పాఠాలు నేర్పారు.ఆయనంటే మెగా కుటుంబానికే కాదు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలకు గౌరవం.

అందుకే ఆ పెద్దాయన రాగానే లావణ్య ఆయన పాదాలకు నమస్కరించారు.ఇక చిరంజీవి ( Chiranjeevi )అంటే పెదమావయ్య కదా.అంత పెద్ద హీరోయిన్ అయి ఉండి ఏమాత్రం పొగరు అహంకారం అనేది లేకుండా పెద్దలకు మర్యాద ఇస్తూ వారి కాళ్లకు నమస్కారం చేయడంతో అందరూ లావణ్య ను మెచ్చుకోవడంతోపాటు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల రిసెప్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

మాదాపూర్‌లోని ఎన్ కన్వెషన్‌లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వేడుక కోసం ఎన్ కన్వెషన్‌లోని హాలును అందంగా ముస్తాబు చేశారు.

Advertisement

రకరకాల పువ్వులు, లైటింగ్‌తో రిసెప్షన్ వేదిక అదిరిపోయింది.

తాజా వార్తలు