Anil Ravipudi : డైరెక్టర్ కాకముందు అనిల్ రావిపూడి సినిమాలలో కూడా నటించారా.. ఏ సినిమా అంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) ఒకరు.

ఈయన కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా తర్వాత సినిమాల ద్వారా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన తర్వాత రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఇటీవల బాలయ్యతో భగవంత్ కేసరి వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఈ సినిమాల ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనిల్ దర్శకుడు కాకముందు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా ( Assistant Director )కూడా పని చేశారనే విషయం మనకు తెలిసిందే.

అంతేకాకుండా ఈయన సినిమాలలో కూడా నటించారు అంటూ తాజాగా ఈయనకి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి అనిల్ రావిపూడి ఏ సినిమాలో నటించారు ఏంటి అనే విషయానికి వస్తే.

Advertisement

సినిమాటోగ్రాఫర్( Cinematographer ) గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని దర్శకుడుగా మారి డైరెక్టర్ శివ దర్శకత్వంలో చిత్రం శౌర్యం.ఈ సినిమాలో గోపీచంద్ సరసన అనుష్క శెట్టి నటించారు.ఇక ఈయన చెల్లెలు పాత్రలో పూనం కౌర్ నటించారు.

ఇలా ఈ సినిమా 2008వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో అనిల్ రావిపూడి నటించారు.

ఈ సినిమాలో గోపీచంద్ విలన్ కు ఒక డేంజరస్ డ్రగ్ ఇచ్చి హీరో తనని హాస్పిటల్స్ మొత్తం తిప్పుతూ ఉంటారు.ఇలా ప్రతి హాస్పిటల్స్ కి ఆయన వెళుతూ ఉంటారు.

ఒక హాస్పిటల్లో అనిల్ రావిపూడి రిసెప్షన్ నిస్ట్ గా ఉంటూ అమ్మాయిలతో పులిహోర కలుపుతూ ఉంటారు అక్కడికి వచ్చి ల్యాబ్ ఎక్కడ అంటూ విలన్ ప్రశ్నించగా ఫస్ట్ ఫ్లోర్ ముందు ఈ ఫామ్ ఫిలప్ చేయండి అనే ఒక సన్నివేషంలో ఈయన కనిపిస్తారు.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఈ విధంగా అనిల్ రావిపుడికి సంబంధించినటువంటి ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఏంటి అనిల్ రావిపూడి సినిమాలలో కూడా నటించారా ఈయన డైరెక్టర్ అయ్యేవరకు పెద్దగా ఎవరికి కూడా తెలియదే అంటూ ఈ వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాకు అనిల్ రావిపూడి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు అంటూ మరికొందరు ఈ వీడియో పట్ల కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
https://www.facebook.com/reel/1140799467112887

తాజా వార్తలు