కొత్త లుక్ లో లోకనాయకుడు.. ఇండియన్ 2 కోసమేనా?

లోక నాయకుడుకమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.కమల్ హాసన్ సినిమాలు విభిన్నంగా ఉంటాయి.

కమర్షియల్ హిట్ సాధించక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.అయితే ఈయన గత కొన్నేళ్లుగా హిట్ లేక బాధ పడుతున్న సమయంలో విక్రమ్ రూపంలో హిట్ వచ్చింది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని అలాగే కొనసాగించాలని దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.

విక్రమ్ హిట్ తో ఎప్పుడో ఆగిపోయిన ఇండియన్ 2 ఇప్పుడు రీస్టార్ట్ చేసారు.విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2.1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కిస్తున్నాడు శంకర్.ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అవ్వగా శరవేగంగా జరుగుతుంది.

Advertisement
Latest Look Of Kamal Haasan, Kamal Haasan, Director Shankar ,kamal Hasan, India

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ క్రమంలోనే తాజాగా కమల్ హాసన్ లుక్ నెట్టింట వైరల్ అయ్యింది.

Latest Look Of Kamal Haasan, Kamal Haasan, Director Shankar ,kamal Hasan, India

ఈయన కోర మీసంతో గడ్డం లేకుండా కొత్త లుక్ లోకి ఈయన మారిపోయాడు.దీనితో ఈ కొత్త లుక్ ఇండియా 2 కోసమే అని ఈ లుక్ తోనే ఈయన సెట్స్ లో జాయిన్ అయ్యాడని కన్ఫర్మ్ అయ్యింది.ఈ లుక్ ఇప్పుడు నెట్టింట బాగా షేర్ అవుతుంది.

ఇక ఈ సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

నితిన్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు