శ్వేత వర్ణంలో మెరిసిపోతున్న కొండచిలువ.. ఇలాంటిది ఎక్కడా చూసి ఉండరు

వర్షాలు, వరదల సమయంలో కొండ చిలువలు( Pythons ) జనావాసాల్లోకి రావడం మనం చూస్తూ ఉంటాం.

చాలా పొడవు గల కొండ చిలువలు పొలాలతో పాటు రోడ్లపై కనిపిస్తూ ఉంటాయి.

ఇలాంటి సమయంలో జనం భయంతో పరుగులు తీస్తారు.అటవీశాఖ అధికారులకు సమాచారం అందిస్తే.

కొండచిలువలను పట్టుకుని తీసుకెళ్లి అడవిలో వదిలిపెడతారు.కొండచిలువలు గోధుమ, బూడిద రంగులో నలుపు చారలతో సాధారణంగా కనిపిస్తాయి.

బయట మనకు కనిపించేవన్నీ ఇలాగే ఉంటాయి.కానీ తాజాగా ఒక వింత రంగులో ఉన్న కొండచిలువ కనిపించింది.

Largest White Python Found In Karnataka,white Python,python,karnataka,viral,snak
Advertisement
Largest White Python Found In Karnataka,White Python,Python,Karnataka,Viral,Snak

కర్ణాటకలో ఓ తొమ్మిది అడుగుల కొండచిలువ( 9 Inch Python ) కనిపించింది.కొండ చిలువలు కనిపిస్తే పెద్ద విషయమేమీ కాదు.కానీ ఈ కొండచిలువ రంగు వేరేలా ఉండటంతో చర్చనీయాంశంగా మారింది.

కొండచిలువ తెల్ల రంగులో( White Python ) మెరిసిపోతూ కనిపించింది.ఉత్తర కన్నడ జిల్లాలోని కుంమ్టా తాలుకాలోని హేగ్దే గ్రామంలో ఇది కనిపించింది.

హేగ్ధే గ్రామానికి చెందిన దేవి నారాయణ్ ముక్రీ ఇంట్లో ఈ కొండచిలువ కనిపించింది.ఇంట్లో దేవీ నారాయణ్‌కు ఈ కొండచిలువ కనిపించగా.

వెంటనే స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు.దీంతో స్నేక్ సొసైటీ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను బంధించారు.

Largest White Python Found In Karnataka,white Python,python,karnataka,viral,snak
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!

అయితే కొండచిలువ తెల్లగా కనిపించడం వెనక ఒక కారణం ఉందని స్నేక్ క్యాచర్ పవన్ నాయక్( Snake Catcher Pawan Nayak ) చెబుతున్నారు.పిగ్మెంట్ లోపించడం వల్లనే తెల్లగా మారుతాయని అంటున్నారు.ఇదే గ్రామంలో గతంలో ఇలాంటి కొండచిలువ ఒకటి కనిపించింది.

Advertisement

అయితే తెలుపు రంగులో ఉండే ఇలాంటి కొండచిలువలు ఎక్కువ కాలం బ్రతకవట.ఇవి కనిపించగానే వేరే జంతువుల అటాక్ చేసి చంపేస్తాయని స్నేక్ క్యాచర్ చెబుతున్నాడు.

ప్రస్తుతం బంధించిన ఈ కొండచిలువ వయస్సు 8 ఏళ్లు ఉంటుందని చెబుతున్నారు.ఈ కొండచిలువను బంధించిన తర్వాత ఫారెస్ట్ సిబ్బందికి అప్పగించారు.

తాజా వార్తలు