Lambasinghi Trailer : లంబసింగి ట్రైలర్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది, చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ : హరీష్ శంకర్ !!!

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది.

ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది.

అదే ‘లంబసింగి’.( Lambasinghi ) ఇప్పుడు ఆ ఊరి లో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతోంది.

‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల( Kalyan Krishna Kurasala ) చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు.నవీన్ గాంధీ( Naveen Gandhi ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు.

భరత్‌ రాజ్ ను( Bharat Raj ) కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు.

Advertisement

ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’. అనేది ఉపశీర్షిక.ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు "నచ్చేసిందే.

డోలారే.వయ్యారి గోదారి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది.

లేటెస్ట్ గా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకులు హరీష్ శంకర్( Harish Shankar ) విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ.కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే నా సొంత సినిమాల అనిపించింది.ట్రైలర్ బాగుంది, అందమైన లొకేషన్స్ లో సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా చెప్పబోతున్నారు.దివి కి అలాగే భరత్ రాజ్ కు ఈ మూవీ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను.

Advertisement

మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.

నటీనటులు:

భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కూరసాల కథ, మాటలు ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: నవీన్ గాంధీ నిర్మాత: ఆనంద్.టి బ్యానర్: కాన్సెప్ట్ ఫిలింస్ కెమెరామెన్: కె.బుజ్జి సంగీతం: ఆర్ఆర్.ధ్రువన్ ఎడిటర్: కె.విజయ్ వర్ధన్ లిరిక్స్: కాసర్ల శ్యామ్ .

తాజా వార్తలు