ఒక్క డైలాగ్‌తో నంద‌మూరి ఫ్యామిలీకి మంట పెట్టిన ల‌క్ష్మీపార్వ‌తి..!

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌మూరి తార‌క రామారావు జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి రావ‌డ‌మే ఓ సంచ‌ల‌నం.

ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి వ‌చ్చాక ఆయ‌న జీవితంలో అనేక ఉత్తాన ప‌త‌నాలు చూసింది.

ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీయే అనేక రాజ‌కీయ మార్పుల‌కు, వివాదాల‌కు కార‌ణ‌మైంది.ఇక ఎన్టీఆర్ మ‌ర‌ణాంత‌రం ఆమె ఏం చేసినా ఓ సంచ‌ల‌న‌మే అవుతోంది.

ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆమె ఎన్టీఆర్ 25వ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వ‌చ్చి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించ‌డంతో పాటు మీడియా ముందే పేల్చిన ఓ బాంబ్ ఇప్పుడు నంద‌మూరి కుటుంబంలో మంట పుట్టించేలా ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Lakshmi Parvati Set Fire To Nandamuri Family With A Single Dialogue,ap,ap Politi

నంద‌మూరి తార‌క రామారావు త‌న కుటుంబంలోనే పుట్టాడంటూ ల‌క్ష్మీ పార్వ‌తి చెప్పారు.త‌న‌కు మ‌న‌వ‌డు పుట్టాడ‌ని చెప్పిన ఆమె త‌న మ‌న‌వ‌డు లిటిల్ ఎన్టీఆర్ అంటూ చెప్పారు.అలాగే త‌న మ‌న‌వ‌డికి ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా ఉన్నాయ‌నడంతో పాటు ఎన్టీఆర్ స్ఫూర్తితోనే త‌న మ‌న‌వ‌డు కూడా ఎదుగుతాడ‌ని ల‌క్ష్మీ పార్వ‌తి చెప్పారు.

Advertisement
Lakshmi Parvati Set Fire To Nandamuri Family With A Single Dialogue,ap,ap Politi

ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు మీడియా, రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ వార‌స‌త్వం ఏదైనా ఉంది అంటే అది నంద‌మూరి ఫ్యామిలీకే ఉంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

Lakshmi Parvati Set Fire To Nandamuri Family With A Single Dialogue,ap,ap Politi

ఎన్టీఆర్ వార‌స‌త్వాన్ని కొన‌సాగించే విష‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌, బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ లాంటి వాళ్లు ఉన్నారు.ఇక ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌ల త‌న‌యుల‌కు కూడా త‌మ వార‌స‌త్వాన్ని కంటిన్యూ చేస్తార‌న్న ప్ర‌క‌ట‌న‌లు ఉన్నాయి.ఇలాంటి టైంలో ల‌క్ష్మీ పార్వ‌తి త‌న మ‌న‌వ‌డిని కూడా ఈ లిస్టులో చేర్చ‌డంతో నంద‌మూరి అభిమానులు కూడా తెర‌వెన‌క ఏం జ‌రుగుతోంద‌న్న దానిపై షాక్ అవుతున్నారు.

ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ కంటే ముందే హ‌రిక‌థ క‌ళాకారుడు వీరగంధం వెంకట సుబ్బారావును పెళ్లి చేసుకుంది.వీరిద్ద‌రికి పుట్టిన కొడుకు డాక్ట‌ర్‌.ఆ డాక్ట‌ర్‌కు పుట్టిన త‌న మ‌న‌వ‌డిని నంద‌మూరి వంశ వార‌సుడిగా ఆమె ప్రొజెక్ట్ చేసుకోవ‌డం.

నంద‌మూరి కాంపౌండ్‌కు పెద్ద షాకే అనుకోవాలి.

గేమ్ చేంజర్ ను ఉద్దేశపూర్వకంగానే తొక్కేశారు.... తమన్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు