ఈ వస్తువులను కింద పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది..!

హిందూ ధర్మం ప్రకారం కొన్ని నియమాలని ప్రజలు తప్పకుండా పాటిస్తూ ఉంటారు.కొన్ని వస్తువుల విషయంలో కూడా ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉంటారు.

హిందూ ధర్మం ప్రకారం ప్రజలు కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా చూసుకుంటారు.ఆ వస్తువులను శుభ్రమైన ప్రదేశంలో ఉంచుతారు.

ముఖ్యంగా చెప్పాలంటే కనీసం కింద కూడా పెట్టారు.చాలా మంది వారికి తెలియక కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.

అలాంటి చిన్న చిన్న తప్పులను అస్సలు చేయకూడదు.

Lakshmi Devi Gets Angry If These Things Are Put Down , Lakshmi Devi, Lord Vishnu
Advertisement
Lakshmi Devi Gets Angry If These Things Are Put Down , Lakshmi Devi, Lord Vishnu

ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడూ కూడా పూజకి ఉపయోగించే వస్తువులను క్రింద పెట్టకూడదు.ఇంకా చెప్పాలంటే కర్పూరం కానీ, కొబ్బరినూనెను( coconut oil ) కానీ, పువ్వులను కానీ కింద అస్సలు పెట్టకూడదు.ఒకవేళ కనుక వాటిని కింద పెడితే వాటిని పూజకి ఉపయోగించకూడదు.

సనాతన ధర్మం ప్రకారం ఇంకొన్ని వస్తువులను కూడా కింద పెట్టకూడదు.ముఖ్యంగా చెప్పాలంటే సాలిగ్రామాన్ని అసలు కింద పెట్టకూడదు.

Lakshmi Devi Gets Angry If These Things Are Put Down , Lakshmi Devi, Lord Vishnu

ఎందుకంటే సాలిగ్రామం విష్ణుమూర్తి( Lord Vishnu ) ప్రతిరూపం.అందుకోసమే ఈ తప్పును అసలు ఎప్పుడు చేయకూడదు.ఇంకా చెప్పాలంటే జంధ్యం ని కూడా కింద పెట్టకూడదు.

జంధ్యాన్ని తల్లిదండ్రులు, గురువులకు ప్రతిరూపంగా భావిస్తారు.వాటిని నేల మీద అసలు పెట్టకూడదు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

దీపాన్ని కూడా నేల మీద పెట్టకూడదు.దీపం కుందు కింద ఒక చిన్న పళ్లెం కానీ, ఒక తమలపాకుని కానీ పెట్టడం మంచిది.

Advertisement

నేలపై పెడితే దేవతలకు అవమానం కలిగినట్లు అవుతుంది.మనం దేవతలను అవమానించకూడదు.

బంగారాన్ని కూడా అసలు క్రింద పెట్టకూడదు.ఎందుకంటే బంగారం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.

ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.అదేవిధంగా శంఖువుని కూడా కింద అసలు పెట్టకూడదు.

ఎందుకంటే లక్ష్మీదేవి ఇందులో కొలువై ఉంటుంది.కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పులను చేయకుండా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

తాజా వార్తలు