లగడపాటి రాజకీయ హడావుడి వెనుక కారణాలు ? 

రాజకీయ వ్యూహకర్త లగడపాటి రాజగోపాల్ మళ్లీ యాక్టివ్ అయ్యారు.ఏపీలో హడావుడి చేస్తున్నారు.

త్వరలో ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే ప్రచారం ఓ వైపు జరుగుతోంది.దీనికి తగ్గట్లుగానే ఆయన వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులతో అనేక అంశాలపై చర్చలు జరుపుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది.2019 ఎన్నికలకు ముందు టిడిపి ఏపీలో అధికారంలోకి వస్తుందని,  అలా కానీ పక్షంలో తాను రాజకీయాలకు , సర్వే లకు దూరంగా ఉంటాను అంటూ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు.ఆయన చెప్పినట్లుగా టిడిపి అధికారంలోకి రాలేదు.

అయినా ఇప్పుడు లగడపాటి మళ్లీ యాక్టీవ్ అవ్వడం, వైసీపీకి చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది.ముఖ్యంగా శని ఆదివారాలో లగడపాటి బిజీబిజీగా గడిపారు.

రాజకీయ ప్రముఖులు  అందరిని కలిశారు.వివిధ పార్టీలోని   కొంతమంది కీలక నాయకులతో ఆయన సమావేశాలు నిర్వహించడం తో ఆయన మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే చర్చ మొదలైంది.

Advertisement

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు,  వైసిపి కాంగ్రెస్ నాయకులు తోనూ లగడపాటి రాజగోపాల్ సమావేశం నిర్వహించారు.అక్కడ అనేక అంశాలపై ఆయన చర్చించినట్లు సమాచారం.

అలాగే నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్,  వైసీపీ నాయకులతో సమావేశాలు నిర్వహించారు.దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా ? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనేది ఆసక్తికరంగా మారింది. 

సర్వేలు నిర్వహించడం లో  దిట్టగా పేరున్న లగడపాటి రాజగోపాల్ గత ఎన్నికల్లో టిడిపి ఓటమి చెందుతుందని అంత అభిప్రాయపడినా, లగడపాటి మాత్రం టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటూ సవాల్ చేశారు.దీంతో ఎన్నికల ఫలితాల అనంతరం లగడపాటి సర్వేల ఫలితం రివర్స్ కావడంతో,  మళ్లీ ఆయన సర్వేలు జోలికి వెళ్ళలేదు.అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ యాక్టివ్ అయ్యేందుకు చూస్తూ ఉండడం,  ప్రశాంత్ కిషోర్ ద్వారా రాజకీయ వ్యూహాలను అమలు చేయాలని చూస్తుండడం, , త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చెరబోతూ ఉండడం తో ఇప్పుడు ఏపీలో లగడపాటి పొలిటికల్ హడావుడి పై ఆసక్తి నెలకొంది.

లడ్డూ వివాదం : ఆ ముగ్గురికి షర్మిల విజ్ఞప్తి 
Advertisement

తాజా వార్తలు