లేడీ పవర్ స్టార్‌ సినిమా వస్తుంటే కనీసం సందడి లేదేం!

సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందిన గార్గి మూవీ ఈనెల 15వ తారీకున విడుదల కాబోతుంది.

ఈ వారంలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు ఎక్కడ కనిపించడం లేదు.

కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా సౌత్‌ లో అన్ని భాషల్లో మరియు హిందీ లో కూడా గార్గి సినిమా ను విడుదల చేయబోతున్నారు.గార్గి సినిమా కు సంబంధించి సందడి ఎక్కడ కూడా కనిపించడం లేదు.

సినిమా లేడీ ఓరియంటెడ్‌ అవ్వడం వల్ల జనాలు ఎక్కువగా ఈ సినిమా ను చర్చించుకోవడం లేదని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం సాయి పల్లవి ఇలాంటి సినిమా లను చేయడం అభిమానులకు ఇష్టం లేదు.అందుకే ఈ సినిమా ను జనాలు తిరష్కరిస్తున్నారు అంటున్నారు.

లేడీ పవర్ స్టార్‌ సాయి పల్లవి నటించిన సినిమా అయినా కూడా ఎందుకు జనాలు పట్టించుకోవడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.పవర్‌ స్టార్‌ సాయి పల్లవి నటించిన సినిమా అయినా కూడా జనాలు పెద్దగా గార్గి విషయం లో ఆసక్తిని కనబర్చడం లేదు.

Advertisement

ఒక సింపుల్‌ టీచర్ పాత్ర లో ఈమె కనిపించబోతుంది.సాయి పల్లవి గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ సినిమా లో కనిపించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

సాయి పల్లవి కీలక పాత్రలో కనిపించబోతున్న సినిమా అయినా కూడా ఇది ఒక డబ్బింగ్‌ సినిమా అవ్వడం వల్ల కూడా తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.ముందు ముందు సినిమా విడుదల అయిన తర్వాత క్లారిటీ ఎలా ఉంటుంది అనేది చూడాలి.

 సాయి పల్లవి కమర్షియల్‌ సినిమా లు చేస్తే పదుల కోట్ల బిజినెస్ జరిగి భారీ అంచనాలు ఉండేది.కాని గార్గి సినిమా విషయంలో మాత్రం అలా జరగడం లేదు.

సింహాచలం దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ రావు
Advertisement

తాజా వార్తలు