కడప జిల్లాలో అధికారుల సమన్వయలోపం..!

కడప జిల్లాలో అధికారుల మధ్య సమన్వయ లోపం బయటపడింది.పాత బస్టాండ్‎ను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది బంద్ చేశారు.

కార్పొరేషన్‎కు పన్ను కట్టలేదని బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు.అయితే, కార్పొరేషన్‎కు ఆర్టీసీ రూ.2 కోట్ల 30 లక్షల పన్నులు బకాయిలు ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు.ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బందికి మద్ధతు తెలిపిన టీడీపీ, సీపీఎం నేతలు.

బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేపట్టారు.వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించారు.

Advertisement
వరాహ పురాణంలో ఏమి ఉన్నది?