తాము చనిపోతామని ముందే తెలిసిందా....

ఎవరికైనా తమ చావు తమ కళ్ళ ముందే ఉంది అని, ముందే తెలిస్తే.ఇంకేమైనా ఉందా.

బ్రతకడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తారు.కానీ.

గత ఏడాది డిసెంబర్ నెలలో జావా సముద్రంలో కూలిన విమానంలో ఉన్న వారికి.విమానం కూలుతోందని ముందే తెలిసిన్డేఈ.

కానీ ప్రాణాలు కాపాడుకునే అవకాశం మాత్రం దక్కలేదు.విమానం బ్లాక్ బాక్స్, ఫ్లయిట్ డేటా రికార్డు గత వారం వెలికి తీసిన విషయం తెలిసిందే.

Advertisement

వాటిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.

విమానం కూలిపోయే ముందు హెచ్చరికలు వచ్చినట్లుగా గుర్తించారు.హెచ్చరికలను గుర్తించిన పైలట్ విమానాన్ని స్థిరీకరించేందుకు ప్రయత్నించాడు.

విమానంలో ఉన్న ప్రయాణీకులకు హెచ్చరికలు జారీ చేసాడు.విమానం కూలిపోతుందని అరిచాడు.

అందువల్లే కొందరు లైఫ్ జాకెట్లు ధరించారని తెలిపారు.విమానాన్ని స్థిరీకరించేందుకు పైలట్ చాలా కృషి చేశారని, అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

నైట్‌ నిద్రించే ముందు ఇలా చేస్తే.. వేక‌ప్ అద్భుతంగా ఉంటుంది!

ఈ బ్లాక్ బాక్స్, ఫ్లైట్ డేటా రికార్డ్ విశ్లేషన వచ్చే వారం ప్రభుత్వానికి చేరనుంది.కాగా, ఎయిర్ ఏషియా విమానం కూలిన ఘటనలో 162 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

ఏది ఏమైనా ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

తాజా వార్తలు