లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలి:కార్మిక నేత ఎలుక సోమయ్య గౌడ్

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 5 వ తేదీన ఢిల్లీలో జరిగే కిసాన్ మజ్దూర్ కిసాన్ సంఘర్ష ర్యాలీని జయప్రదం చేయాలని కార్మికులకు భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం)జిల్లా ప్రధాన కార్యదర్శి యలక సోమయ్య గౌడ్ పిలుపునిచ్చారు.

శనివారం హుజూర్ నగర్ లోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నింటిన తరుణంలో పేదవాడు పేదరికంలోకి,ఉన్నవాడు మరింత గొప్ప ధనికులుగా మారుతున్నారని చెప్పారు.

దీనికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే మూలకారణమని, కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలికే ప్రభుత్వాలకు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పాలని కార్మికులను కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చల్ల జయకృష్ణ,మండల అధ్యక్షులు తమ్మిశెట్టి రాములు,ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా, పట్టణ అధ్యక్షులు ఉప్పతల వెంకన్న, కోశాధికారి ఉప్పతల నరేష్,గోవిందు,షేక్ నాగుల్ మీరా,జాన్వియా, బుజ్జి,వెంకన్న,వీరస్వామి,శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

Latest Suryapet News